Begin typing your search above and press return to search.

జేజ‌మ్మ‌ను క‌న్న అమ్మా నాన్నల‌‌ను చూశారా?

By:  Tupaki Desk   |   16 March 2021 7:15 PM IST
జేజ‌మ్మ‌ను క‌న్న అమ్మా నాన్నల‌‌ను చూశారా?
X
టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌గా అనుష్క అందుకోని శిఖ‌రం లేదు. ఇండ‌స్ట్రీ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా నాయిక‌గా న‌టించింది. న‌వ‌త‌రం హీరోల‌కు స్వీటీ ఒక ఆప్ష‌న్ గా కొన‌సాగింది. అటు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోనూ అగ్ర హీరోయిన్ హోదాను ఆస్వాధించింది. సంచ‌ల‌నాల పాన్ ఇండియా సినిమా బాహుబ‌లి లో దేవ‌సేన పాత్ర‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న ఖ్యాతి విస్త‌రించింది. జేజమ్మ‌గా అరుంధ‌తిగా తెలుగు వారి గుండెల్లో కొలువై ఉన్న స్వీటీ ఇటీవ‌ల ఎందుక‌నో స్త‌‌బ్ధుగా ఉన్నారు.

అనుష్క పెళ్లి మూడ్ లో ఉన్నార‌ని .. ఇంట్లో వాళ్లు వ‌రుడిని వెతుకుతున్నార‌ని.. ‌త్వ‌ర‌లోనే ఓ ఇంటిది అయిపోనుంద‌ని ర‌క‌ర‌కాల గాసిప్పులు షికార్ చేశాయి. వాటిని అనుష్క ఖండించ‌నూ లేదు. అలాగ‌ని నిజమే‌న‌ని చెప్ప‌లేదు. దీంతో అభిమానులు చాలా క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు.

నిశ్శ‌బ్ధం రిలీజ‌య్యాక మ‌రో సినిమాకి క‌మిటైన జాడ క‌నిపించ‌డం లేదు. ఒప్పుకున్న‌వి చేయాల్సి ఉన్నా కానీ ఎందుక‌నో స్వీటీ సైలెంటుగానే ఉంటున్నారు. ఉన్న‌ట్టుండి ఇదిగో ఇలా నేడు త‌న త‌ల్లిదండ్రుల‌తో స్వీటీ ఇన్ స్టాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అమ్మా నాన్న‌కు పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు అంటూ ఎంతో ఆనందంగా క‌నిపించారు.

స్వీటీ ఎంతో సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు ఈ ఫ్రేమ్ లో. త‌న త‌ల్లి గారిని అమ్మ అని ప్ర‌స్థావించిన అనుష్క నాన్న‌ను పాపా అని పిల‌వ‌డం ఆస‌క్తిక‌రం. ఇక మంగుళూరులోని స్వీట్ హోమ్ లో ఎంతో సంతోషంగా ఉన్న స్వీటీ తొంద‌ర్లోనే మంచి శుభ‌వార్త చెప్ప‌నున్నారా? లేక మ‌ళ్లీ కెరీర్ ప‌రంగా బిజీ అవుతారా? అన్న‌ది వేచి చూడాలి.