Begin typing your search above and press return to search.

మూగ చెవిటి భాష ఈ మూగ‌జీవానికి అర్థ‌మైందా స్వీటీ?

By:  Tupaki Desk   |   2 Oct 2020 2:20 PM IST
మూగ చెవిటి భాష ఈ మూగ‌జీవానికి అర్థ‌మైందా స్వీటీ?
X
స్వీటీ అనుష్క శెట్టి న‌టించిన నిశ్శబ్ధం నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీపై రివ్యూలో మోతెక్కిపోయాయి. మూగ చెవిటి అమ్మాయిగా అనుష్క న‌ట‌న మైమ‌రిపించింద‌ని ప్ర‌శంసించిన క్రిటిక్స్ `ఇదో నీర‌సం` అంటూ విమ‌ర్శించ‌డం.. యావ‌రేజ్ మార్కులే వేయ‌డం తెలిసిన‌దే.

అదంతా స‌రే కానీ.. స్వీటీ అనుష్క శెట్టి రిలీజ్ ముందు క్రేజీగా ప్ర‌చారానికి వ‌స్తుంద‌ని అనుకుంటే మ‌హ‌మ్మారీ వ‌ల్ల పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మైంది. ఇక వీలున్నంత వ‌ర‌కూ సోష‌ల్ మీడియాల్లో త‌న సినిమాని ప్ర‌చారం చేయ‌డంతో స‌రిపుచ్చింది. ప‌నిలో ప‌నిగా అనుష్క‌తో ఇంట్లోనే ప్రీమియ‌ర్ చూస్తున్న ఈ ఫ్రెండుని చూశారా?

నిశ్వ‌బ్ధం తెలుగు- ప్రైమ్ వీడియో అంటూ ఉన్న ఆ స్క్రీన్ ని త‌థేకంగా వీక్షిస్తోంది ఈ పెట్ డాగ్. అది అనుష్క పెంపుడు కుక్క. త‌నంటే విప‌రీత‌మైన ప్రేమాభిమానాల‌ట‌. కుటుంబంతో క‌లిసిపోయి ఇదిగో ఇలా ప్రివ్యూలు కూడా చూసి ఆస్వాధిస్తుంది. అన్న‌ట్టు స్వీటీ మూగ చెవిటి భాష ఈ మూగ‌జీవానికి అర్థ‌మైందో ఏమిటో ఆ ఎక్స్ ప్రెష‌న్ సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంది మ‌రి. ఇక మ్యాడీని చూసి కూడా ఇది చాలా క్లోజ్ అయిపోయిన‌ట్టుంది. నా తొలి ఓటీటీ రిలీజ్ ని బాగా ఆస్వాధించినందుకు ఆనందంగా ఉంది అంటూ అనుష్క మెసేజ్ పెట్టింది.