Begin typing your search above and press return to search.
విరాట్-అనుష్క ప్రేమ బిజినెస్?
By: Tupaki Desk | 19 Sept 2017 1:36 PM ISTప్రస్తుతం ఇంటర్ నేషనల్ లెవల్ లో ఉన్న ఒక సెలబ్రెటీ ప్రేమజంట ఏది అని ఎవరైనా అడిగితే అందరు విరాట్ - అనుష్క అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పేస్తారు. ఎప్పుడు వీరి మనస్సులు ఒక్కటయ్యాయో గాని అప్పటి నుంచి అభిమానులు రోజుకో స్టైల్ లో దర్శనం ఇస్తున్నారు. విశాల ప్రపంచంలో దేశాలన్నీ చుట్టేసి ప్రేమలో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతున్నారు. సమయం దొరుకితే చాలు విహార యాత్రలకు వెళుతున్నారు.
అలాగే సినిమా వేడుకలకి కూడా ఈ జంట కలిసి వెళుతూ అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు గ్రౌండ్ లో విరాట్ అలరిస్తుంటే.. తెరపై అనుష్క నటనతో అందరిని ఆకట్టుకుంటోంది. అయితే వీరి ప్రేమ చిగురించి చాలా కాలం అయినా ఇంకా పెళ్లి అనే మాటను ఇంతవరకు ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో ఎన్ని ఫోటోలు పోస్ట్ చేస్తున్న ప్రేమ అంటున్నారే గాని పెళ్లి అనే పదాన్ని కూడా వారు వాడటం లేదు. అయితే ప్రస్తుతం వీరు త్వరలో ఒకటవ్వడానికి కొన్ని ప్రయత్నాలను చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకోసం ముందుగానే వారిద్దరు కలిసి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టబోతున్నట్లు కొన్ని కామెంట్స్ వినబడుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో స్టార్ రెస్టారెంట్స్ ని నిర్మించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై లో ఒక స్థలాన్ని కొన్నట్లు టాక్. అలాగే ఢిల్లీలో కూడా కొన్ని స్థలాల్ని పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమే తెలియాలంటే విరాట్ - అనుష్కలే చెప్పాలి.