Begin typing your search above and press return to search.
అనుష్క మరింత గొప్ప స్థాయికి ఎదగాలి: డాషింగ్ డైరెక్టర్
By: Tupaki Desk | 24 July 2020 9:01 AM ISTటాలీవుడ్ ఇండస్ట్రీకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా అడుగు పెట్టింది బెంగళూరు బ్యూటీ అనుష్క శెట్టి. తొలి సినిమాలోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుష్క, ఆ తర్వాత మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. కొంతకాలానికే అరుంధతి సినిమా అవకాశం రావడం.. ఇక ఆ సినిమాలో ఆమె అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ దేవసేన. ఆ సినిమాతో ఎన్నో గొప్ప రికార్డులు కూడా నెలకొల్పింది. ఎన్నో అవకాశాలుతో దూసుకెళ్లిన అనుష్క బాహుబలి సినిమాలతో ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు, క్రేజ్ ను పొంది మరో స్థాయికి ఎదిగింది. ఇక కొన్నేళ్లుగా అనుష్క అభిమానులు ఎదురుచూస్తున్న ముచ్చట అనుష్క పెళ్లి. ఆ విషయం పక్కన పెడితే..
నేడు అనుష్క నటించిన ఫస్ట్ మూవీ 'సూపర్' విడుదలైన రోజు. సరిగ్గా 15 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అనుష్కను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో తన సందేశం పోస్ట్ చేసాడు. "అనుష్కను మొదటిసారి చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నాగార్జున చెప్పారు. మా అనుష్క సినీఇండస్ట్రీకి పరిచయం అయిన సూపర్ మూవీ రిలీజ్ డే ఈరోజు. సూపర్ నుండి నిశ్శబ్దం మూవీ వరకు అనుష్క ఎన్నో మెట్లు ఎక్కుతూ వస్తుంది. ఆమెను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అనుష్క మరిన్ని గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు" పూరీ తెలిపాడు. ఇదిలా ఉండగా.. బాహుబలి తర్వాత చిన్న సినిమాల దర్శక నిర్మాతలు అనుష్కను కలవడమే మానేశారట. అయితే తాజాగా మరోసారి లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'నిశ్శబ్దం' చేసింది. త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు.