Begin typing your search above and press return to search.

సోద‌రుడు రానాతో అనుష్క శెట్టి!

By:  Tupaki Desk   |   14 Dec 2021 6:32 AM GMT
సోద‌రుడు రానాతో అనుష్క శెట్టి!
X
నేడు భ‌ళ్లాల దేవుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా కోస్టార్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతూ రానా పోస్ట‌ర్ల‌ను షేర్ చేస్తున్నారు.

తాజాగా అనుష్క శెట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా `సోదరుడు` రానా దగ్గుబాటితో క‌లిసి ఉన్న ఓ త్రోబాక్ ఫోటోను పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమకు చెందిన అతని స్నేహితులు సోషల్ మీడియాలో అపారమైన ప్రేమను ప్ర‌క‌టిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాహుబలి సహనటుడికి శుభాకాంక్షలు తెలిపే క్ర‌మంలో అందాల అనుష్క శెట్టి కొంత గ్యాప్ త‌ర్వాత‌ అభిమానులకు ట‌చ్ లోకి వ‌చ్చింది. రానాతో అనుష్క ఫోటో షేర్ చేసి.. ``హప్పు హప్పు హప్పుయెస్ట్ బ‌ర్త్ డే బ్రో... మీరు చాలా ప్రేమతో జీవితంలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను`` అని వ్యాఖ్య‌ను జోడించారు.

హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ అని కాకుండా హ‌ప్పు హ‌ప్పు హ‌ప్పీయెస్ట్ అంటూ అనుష్క కాస్త పోయెటిక్ గానే స్పందించ‌డం ఆస‌క్తిక‌రం. అనుష్క షేర్ చేసిన ఈ రేర్ ఫోటోగ్రాఫ్ ఆరేడేళ్ల క్రితం నాటిది అని అర్థ‌మ‌వుతోంది. ఇక అనుష్క త‌దుప‌రి యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మూవీలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు దర్శకుడు క్రిష్ కూడా త‌న స్నేహితుడు రానాకి విషెస్ తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా రానా కోసం సుదీర్ఘంగా హృదయపూర్వక నోట్ ను కూడా రాశాడు. ఆ నోట్ లో ఇలా ఉంది. ``మీకు జన్మదిన శుభాకాంక్షలు ప్రియమైన @రానా ద‌గ్గుబాటి! మీరు ఎప్పటికీ గ‌ప్ప‌ ఆత్మ క‌లిగిన‌వారు .. నిజమైన స్నేహితుడు కూడా.. రానున్న ఏడాదికి ఈరోజు ప్ర‌త్యేక‌మైనది. మేక్ ఇట్ కౌంట్ డౌన్ బావా!`` అంటూ విష్ చేశారు.

ఈ రోజు రానా పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ నిర్మాతలు డేనియల్ శేఖర్ పాత్ర కొత్త లుక్ కి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నారు. వీడియో సాయంత్రం 4:05 గంటలకు విడుదల అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. ఆయ‌న ర‌చ‌యిత‌గా.. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ 2020లో రూపొందించిన మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ కి అధికారిక‌ రీమేక్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయ‌క్ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.