Begin typing your search above and press return to search.

అనుష్క నెక్స్ట్ సినిమా డైరెక్టర్ అతనేనా..!

By:  Tupaki Desk   |   26 March 2020 4:31 PM IST
అనుష్క నెక్స్ట్ సినిమా డైరెక్టర్ అతనేనా..!
X
తెలుగు అందాల తార అనుష్క శెట్టి. కెరీర్ ప్రారంభం నుండి విపరీతంగా ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ పొడుగు సుందరి. బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించేసింది. చాలా సెలెక్టీవ్ గా ఒక్కో సినిమా చేస్తూ వస్తుంది. ఇక బాహుబలి అనంతరం అమ్మడు ఏ హీరోతో కూడా సినిమా ఓకే చేయలేదు. భాగమతి సినిమా చేసింది కానీ లేడీ ఓరియెంటెడ్ మూవీ అది. ఇప్పుడు విడుదలకు సిద్దమైన నిశ్శబ్దం సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ కావడంతో అనుష్క అభిమానులు ఎవరైనా హీరోతో చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.

తాజా కథనాల ప్రకారం.. అనుష్క అభిమానులకి త్వరలోనే తీపి కబురు అందించనుందట. ఇన్నేళ్లకు అనుష్క ఒక తమిళ హీరో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. అజిత్ హీరోగా.. 'ఎంతవారుగాని' సినిమాను రూపొందించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలో అనుష్క నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే అనుష్కను అభిమానులు కోరుకున్నట్లు హీరో సరసన చూడొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పై అనుష్క రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. అధికారికంగా త్వరలో వివరిస్తారేమో అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.