Begin typing your search above and press return to search.

డీటాక్స్ ప్రోగ్రామ్ అంటున్న భాగమతి

By:  Tupaki Desk   |   27 Sept 2018 11:40 AM IST
డీటాక్స్ ప్రోగ్రామ్ అంటున్న భాగమతి
X
అందానికి.. గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ అంటే అనుష్కనే. కానీ 'సైజ్ జీరో' ప్రయోగం వికటించి అనుష్క కు బొద్దుగుమ్మ ట్యాగ్ వచ్చింది. అప్పటినుండి అదనపు బరువును వదిలించుకోవడానికి స్వీటీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం.. పాత స్వీటీ లుక్ మాత్రం ఇంతవరకూ రాలేదు. ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఆ జీరో సైజ్ బరువుకు మంగళం పాడేందుకు ఆస్ట్రియాకు వెళ్లనుందట.

విశ్వసనీయం సమాచారం ప్రకారం అనుష్క ఆస్ట్రియా దేశంలో ఒక ఫేమస్ డీటాక్స్ ప్రోగ్రామ్ కు ఎన్రోల్ చేసుకుందట. ప్రపంచంలోనే ప్రముఖ డీటాక్స్.. వెల్నెస్ సెంటర్స్ లో ఒకటైన వివా మేయర్(Viva Mayr) లో కొన్ని రోజులు గడిపి తన ఎక్స్ట్రా కెలోరీస్ కరిగించి మళ్ళీ స్లిమ్ అండ్ ఫిట్ అనుష్క గా మారడానికి డిసైడ్ అయిందట. ఈ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుందట.

మాధవన్ హీరోగా తెరకెక్కుతున ఒక సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న విషయం తెలిసిందే కదా. ఇది కాకుండా ఒక యువ దర్శకుడు కూడా అనుష్కకు ఇంట్రెస్టింగ్ కథ వినిపించాడట. ఆ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలో ఉందట. ఆస్ట్రియా నుండి తిరిగిరాగానే ఈ సినిమా గురించి తుది నిర్ణయంతీసుకోనుందట.