Begin typing your search above and press return to search.

సైరాలో అనుష్క పాత్ర డిసైడ్ అయ్యిందా ?

By:  Tupaki Desk   |   16 May 2019 12:10 PM IST
సైరాలో అనుష్క పాత్ర డిసైడ్ అయ్యిందా ?
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉంది. మొన్న అగ్ని ప్రమాదం జరిగి సెట్ కాలిపోకపోయి ఉంటే ఇంకాస్త వేగంగా ముగింపు దశకు వచ్చేది ఇప్పుడు కొంత ఆలస్యం తప్పదు. దసరాకు వచ్చే విషయంలో క్లారిటీ మిస్ అవుతోంది. టీమ్ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.

ఇదిలా ఉండగా అనుష్క సైరాలో కీలకమైన క్యామియో ఒకటి చేస్తోందని వారం రోజుల క్రితమే టాక్ వచ్చింది. అది నిర్ధారణగా ఎవరూ చెప్పలేదు కానీ కాస్త బలంగా ఈ న్యూస్ లో ఫిలిం నగర్ ప్రచారంలో నలిగింది. ఇప్పుడు మరో అప్ డేట్ సస్పెన్స్ ని కొంత తగ్గించేలా ఉంది. దాని ప్రకారం సైరాలో అనుష్క రోల్ కి సంబంధించిన క్లారిటీ కొంత వస్తోంది

ఇందులో అనుష్క సైరా నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే క్యూరేటర్ గా కనిపిస్తుందట. అంటే సినిమా కథలో భాగంగా కనిపించదు కానీ ఆ స్టోరీని మనకు చెప్పే యాంకర్ రోల్ లాంటిదన్న మాట. ఈ లెక్కన చిరుతో అనుష్క కాంబినేషన్ సీన్లకు అవకాశం లేనట్టే. ఇంకా చెప్పాలంటే మహానటిలో సమంతా కీర్తి సురేష్ ల కాంబో ఎలాగైతే ఉండదో ఇందులో కూడా అదే తరహాలో అనుష్క చిరుల మధ్య సన్నివేశాలు ఉండవు.

ఇది అధికారికంగా ప్రకటించకపోయినా నిజమే అని సమాచారం. ఈ విషయంలో రామ్ చరణ్ ప్రత్యేక చొరవ తీసుకుని స్వీటీని ఒప్పించినట్టు తెలిసింది. టీమ్ నుంచి దీనికి సంబంధించి ప్రకటన వచ్చే దాకా చెప్పలేం కానీ ఈ న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి ఎంతో కొంత కిక్ ఇచ్చేదే