Begin typing your search above and press return to search.

రవి నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాడు : అనుష్క

By:  Tupaki Desk   |   20 May 2019 5:41 PM IST
రవి నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాడు : అనుష్క
X
సెలబ్రెటీలు ప్రతి రోజు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు, వారికి సహాయంగా ఎంతో మంది పని చేస్తూ ఉంటారు. తమకు సహాయకులుగా చేసిన వారిని ఎక్కువ శాతం మంది పెద్దగా పట్టించుకోరు. అవసరం ఉన్నంత వరకు వారిని తమ వద్ద ఉద్యోగంలో ఉంచుకుని ఆ తర్వాత వదిలేస్తారు. కాని అనుష్క మాత్రం అలా కాదు. అందరిలో అనుష్క చాలా విభిన్న అని మరోసారి నిరూపితం అయ్యింది. అనుష్క కెరీర్‌ ఆరంభం సమయంలో రవి అనే వ్యక్తి సహాయకుడిగా ఉండేవాడట. అతడు చిన్న వయసులోనే మృతి చెందాడు. ఏడు సంవత్సరాల క్రితం మృతి చెందిన రవి గురించి అనుష్క తాజాగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టి అందరిని ఆశ్చర్య పర్చింది.

అనుష్క ఇన్‌ స్టాలో తాను గతంలో రవితో తీసుకున్న ఒక ఫొటోను షేర్‌ చేసింది. రవి అనే యువకుడు నాకు సహాయకుడిగా పని చేశాడు. చాలా చిన్న వయసులోనే అతడు చనిపోయాడు. చనిపోయిన రవి నాకు ఇప్పటికి ఎప్పుడూ కూడా గుర్తు వస్తూనే ఉంటాడు. రవిలో అమాయకత్వం, ఎలాంటి కపటం లేని మనస్థత్వ అతడిది. అతడు దూరం అవ్వడంను నేను ఇంకా కూడా జీర్ణించుకోలేక పోతున్నాను. అతడి మరణం నా జీవితంలో పెద్ద లోటు, మనల్ని బాగా ఇష్టపడే వారు, మనం బాగా ఇష్టపడే వారు చనిపోతే వారి ఆత్మ మనతోనే ఉంటుంది. మనకు వారు చనిపోనట్లుగానే అనిపిస్తుంది. రవితే నాకు 14 ఏళ్ల అనుబంధం, అతడు చనిపోయి 7 ఏళ్లు అయ్యింది. అయినా కూడా రవి నా గుండెల్లో ఉన్నాడు అంటూ ఎమోషనల్‌ అయ్యింది. ఒక సహాయకుడి గురించి అనుష్క చేసిన ఈ పోస్ట్‌ ఆమె మనస్థత్వంను తెలియజేస్తుంది. ఆమె తన అనుకున్న వారికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తుందో ఆ పోస్ట్‌ తో అర్థం చేసుకోవచ్చు.

ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే దాదాపు సంవత్సరం పాటు కెమెరాకు పూర్తిగా దూరంగా ఉన్న అనుష్క మళ్లీ రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. త్వరలోనే సైలెన్స్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. సైజ్‌ జీరో చిత్రం కోసం చాలా లావు అయిన అనుష్క గత కొన్నాళ్లుగా సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. అనుష్క రీ ఎంట్రీ కోసం అభిమానులు సినీ వర్గాల వారు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.