Begin typing your search above and press return to search.

భల్లాలదేవ బ్రో కి దేవసేన ధన్యవాదాలు..!

By:  Tupaki Desk   |   27 March 2021 7:15 AM GMT
భల్లాలదేవ బ్రో కి దేవసేన ధన్యవాదాలు..!
X
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి - హీరోయిన్ అనుష్క ఇద్దరూ సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇద్దరూ 'బాహుబలి' 'బాహుబలి 2' 'రుద్రమదేవి' వంటి సినిమాలలో కలిసి నటించారు. అయితే రానా లేటెస్ట్ మూవీ 'అరణ్య' రిలీజ్ సందర్భంగా అనుష్క కు స్పెషల్ గూడీస్ ని గిఫ్ట్ గా పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంతోషించిన స్వీటీ శెట్టి.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది.

''థాంక్యూ రానా బ్రో.. నాకు ఇవి బాగా నచ్చాయి. 'అరణ్య' టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు'' అని అనుష్క పోస్ట్ పెట్టింది. రానా పంపిన గూడీస్ పక్కన తన పెట్ డాగ్ ని నిలబెట్టి ఓ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే భల్లాలదేవుడుని దేవసేన బ్రో అనేసరికి వీరిద్దరూ స్నేహితులుగా కంటే బ్రదర్ అండ్ సిస్టర్ గా ఉంటారని అర్థం అవుతోంది. ఇకపోతే రానా ఇండస్ట్రీలోని తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ 'అరణ్య' గూడీస్ పంపినట్లు తెలుస్తోంది. సమంత అక్కినేని - నమ్రత శిరోద్కర్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా రానాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలావుండగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అరణ్య' సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మంచి ప్రయత్నంగా మిగిలిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే రానా అసాధారణమైన నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.