Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్లు.. కోట్లలో రెమ్యూనరేషన్లు!

By:  Tupaki Desk   |   28 May 2019 2:34 PM GMT
స్టార్ హీరోయిన్లు.. కోట్లలో రెమ్యూనరేషన్లు!
X
స్టార్ హీరోలే కాదు.. హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్కే. స్టార్ హీరోయిన్లకు కోట్ల కొద్దీ రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇస్తారని వార్తలు వస్తుంటాయి కానీ ఎవరికీ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారనేదానిపై ఎవరికీ పెద్దగా క్లారిటీ ఉండదు. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల రెమ్యూనరేషన్ పై ఒక ఇంగ్లీష్ పత్రిక కథనం ప్రచురించింది.

మరి ఈ లిస్టులో అందరికంటే టాప్ లో ఉన్న హీరోయిన్ ఎవరనుకున్నారు? టాలీవుడ్ స్వీటీ అనుష్క. ఒక సినిమాకు అనుష్కకు మూడు కోట్ల రూపాయల ఫీజు ఇస్తారట. అనుష్క రేంజ్ లో మరే ఇతర హీరోయిన్ కూడా లేదు. దీనికి కారణం కూడా స్పష్టం. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన అనుష్క పోస్టర్ పై తన ఫోటోతోనే ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించగల ఇమేజ్ ఉంది. అది ఇప్పటికే ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అనుష్క లాస్ట్ సినిమా 'భాగమతి' కూడా మరో సారి అనుష్క సత్తాను ఋజువు చేసుకుంది.

అనుష్క తర్వాత స్థానంలో ఉన్న హీరోయిన్ సమంతా అక్కినేని. వరస హిట్లతో జోరు మీద ఉన్న సమంతా రెమ్యూనరేషన్ రెండు కోట్ల రూపాయలని సమాచారం. సామ్ తర్వాత స్థానంలో కీర్తి సురేష్.. కాజల్ అగర్వాల్ ఉన్నారట. వారి రెమ్యూనరేషన్ రూ.1.5 కోట్లు. ఇక నెక్స్ట్ చూస్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ భామ రెమ్యూనరేషన్ కోటి రూపాయలని సమాచారం. మిగతా హీరోయిన్ల రేమ్యూనరేషన్ కోటి లోపే ఉంటుందట.