Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడలో ఆమె ఝాన్సీ లక్ష్మి బాయి?

By:  Tupaki Desk   |   3 July 2019 9:56 AM GMT
ఉయ్యాలవాడలో ఆమె ఝాన్సీ లక్ష్మి బాయి?
X
మెగాస్టార్ ప్రస్తుతం మొదటి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'సైరా' లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పలువురు స్టార్లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అందులో అనుష్క కూడా ఒకరు. అయితే ఈ సినిమాలో అనుష్క ఏ పాత్రలో నటిస్తోందనే విషయంపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో నరసింహారెడ్డి కథను అనుష్క పాత్ర ద్వారా చెప్పిస్తారని.. లేదు మరేదో పాత్ర అని గతంలో వార్తలు వినిపించాయి.

కానీ అనుష్క పాత్ర విషయంలో ఫ్రెష్ గా వినిపిస్తున్న టాక్ అందరికీ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమాలో అనుష్క ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. అనుష్క గతంలో రుద్రమదేవి పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ 'స్వీటీ' సర్ ప్రైజ్ నిజమైతే మరో సారి తెలుగు ప్రేక్షకులు థ్రిల్ కావడం ఖాయమే. అయితే అనుష్క ఈ పాత్రలో నటించడం అనేది జస్ట్ గాసిప్పా లేదా నిజమా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడకతప్పదు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా' ను రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార.. తమన్నా.. సుదీప్‌.. జగపతి బాబు.. విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్ త్రివేది. అక్టోబర్ 2 న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.