Begin typing your search above and press return to search.

'మ్యాగజైన్ ఫోటోషూట్'తో ఫుల్ ఫైర్ మీదున్న స్టార్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   1 July 2020 1:00 PM GMT
మ్యాగజైన్ ఫోటోషూట్తో ఫుల్ ఫైర్ మీదున్న స్టార్ హీరోయిన్!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ అంటే సినీప్రియులు అందరికి సుపరిచితమే. ఎందుకంటే అనుష్క హీరోయిన్ గా తెలియకపోయినా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా గుర్తుంటుంది. మోడలింగ్ నుండి కథానాయికగా మారిన అనుష్క జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అయితే మోడల్ గా ఉన్నప్పుడు మ్యాగజైన్స్ కోసం ఎన్ని అందాలు ఆరబోసిందో సినిమాల్లోకి వచ్చాక అమ్మడు అంతకుమించి అందాల ప్రదర్శన చేసిందని చెప్పాలి. చీరకట్టు నుండి బికినీ వరకు అనుష్కను ఆరాధ్య దేవతగా భావించే అభిమానులు కోట్లలో ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీతో పెళ్లి అయిన తర్వాత ఈ భామ కాస్త అందాల ప్రదర్శన తగ్గించిందని చెప్పాలి. కాకపోతే సినిమా ఫీల్డ్ మాత్రం వదలలేదు. ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీనే ఆమె ప్యాషన్ అంటోంది. హీరోయిన్ గా ఎదిగిన తర్వాత అమ్మడు కాస్త సినీ నిర్మాణం వైపు కూడా అడుగులు వేసింది. అందులో కూడా సక్సెస్ అందుకుంది.

ఇండస్ట్రీలోకి రావడంతోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన 'రబ్ నే బనాది జోడి' సినిమాలో మెప్పించింది. అలాగే వరుస అవకాశాలతో స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వలన ఇంట్లోనే ఉంటున్న అనుష్క.. రీసెంట్ గా 'పాతాళలోక్' అనే వెబ్ సిరీస్ నిర్మించి హిట్ అందుకుంది. కొంతకాలంగా అనుష్క తెరమీద తక్కువగా కనిపిస్తుంది. తాజాగా అమ్మడు వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఆ పిక్ ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజంగా తన అందాలతో కుర్రగుండెలకు నిప్పంటించిందని చెప్పాలి. ఆమె కళ్లు.. చూపు.. ముఖంలో ఆత్మవిశ్వాసం అన్నీ ఓ స్ట్రాంగ్ మహిళగా నిరూపిస్తున్నాయి. అనుష్క బ్యూటీని మిస్ అవుతున్న వారికి ఈ వోగ్ మ్యాగజైన్ పిక్ పండగే అని చెప్పాలి. ఇక వెరీ టాలెంటెడ్ అనుష్క నిర్మాణ రంగంలో కూడా రాణిస్తున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం అమ్మడు ఏ మూవీ ఓకే చేయలేదని సమాచారం.