Begin typing your search above and press return to search.

లెజెండ్‌ భార్య అయితే లెజెండ్‌ అయిపోద్దా?

By:  Tupaki Desk   |   20 Jan 2019 6:18 AM GMT
లెజెండ్‌ భార్య అయితే లెజెండ్‌ అయిపోద్దా?
X
టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ లెజెండ్‌ అనడంలో తప్పులేదు. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎన్నో అద్బుత రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు మరియు వన్డేల్లో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి క్రికెటర్‌ ను లెజెండ్‌ అనడం కరెక్టే. కాని ఆయన భార్య బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కను ఎలా లెజెండ్‌ అంటారు అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యూఎస్‌ ఓపెన్‌ అధికారిక సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్‌ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం ఈ విమర్శలకు నెలవైంది.

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్టు మరియు వన్డే సిరీస్‌ ను గెలుసుకున్న సంతోషంలో ఉన్న విరాట్‌ కోహ్లీ అక్కడే భార్య అనుష్కతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మ్యాచ్‌ లకు విరుష్క వెళ్లారు. అక్కడ వీరిద్దరు టెన్నీస్‌ లెజెండ్‌ రోజర్‌ ఫెదరర్‌ ను కలుసుకున్నారు. ఈ ముగ్గురు ఫొటో మూమెంట్‌ తీసుకున్నారు. ఈముగ్గురు కలిసి ఉన్న ఫొటోను యూఎస్‌ ఓపెన్‌ పోస్ట్‌ చేసి, ఒకే ఫొటోలో ముగ్గురు లెజెండ్స్‌ అంటూ కామెంట్‌ పెట్టి పోస్ట్‌ చేసింది.

అనుష్క లెజెండ్‌ ఏంటీ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. లెజెండ్‌ భార్యను లెజెండ్‌ అలాంటారా, లెజెండ్‌ అనే పదానికి విలువ లేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అనుష్కను లెజెండ్‌ అంటూ కామెంట్‌ చేసినందుకు గాను యూఎస్‌ ఓపెన్‌ అధికారిక పేజీపై పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తుంది. విరాట్‌ కోహ్లీ భార్య అయినంత మాత్రాన ఆమె ఎలా లెజెండ్‌ అవుతుందని నెటిజన్స్‌ వేస్తున్న ప్రశ్నకు యూఎస్‌ ఓపెన్‌ సమాధానం ఏంటో చూడాలి.