Begin typing your search above and press return to search.
తల్లి కాబోతున్న అనుష్క.? అసలు నిజమిదీ?
By: Tupaki Desk | 6 April 2020 2:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం సాగించి చివరకు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఎన్నో మంచి చిత్రాలు చేసి పాపులర్ అయిన నటి తాజాగా సినిమాలకు దూరం కావడం చర్చనీయాంశమైంది. ఆమె ఎందుకు సినిమాల్లో నటించట్లేదన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలుస్తోంది.
అయితే అనుష్క తల్లి కాబోతోందని.. అందుకే సినిమాలకు దూరమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం అనుష్క వరకూ రావడంతో తాజాగా షాకింగ్ సమాధానమిచ్చింది.
తాజాగా సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించిన అనుష్కను ఓ నెటిజన్ ఇదే విషయం అడిగేశాడు.. దీనికి అనుష్క సమాధానమిచ్చింది. ‘తనకు పిల్లలను ఎప్పుడు కనాలో తెలుసు.. మా లైఫ్ లో ఎవరి జోక్యం అవసరం లేదు.. సినిమాలు చేయట్లేదంటే.. మంచి నచ్చిన కథలు రావడం లేదని అర్థం’ అంటూ ఫైర్ అయ్యింది.
గత ఏడాది కాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ మూవీ అనుష్కకు చివరిది. ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో ఇక మంచి కథ వస్తేనే చేస్తానని అనుష్క ఊరుకుంది. తాజాగా ప్రముఖ క్రికెటెర్ జులన్ గోస్వామి బయోపిక్ లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి కాబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది.