Begin typing your search above and press return to search.

పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసు : అనుష్క శర్మ

By:  Tupaki Desk   |   31 March 2020 3:40 PM IST
పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసు : అనుష్క శర్మ
X
అనుష్క శర్మ .. 'రబ్ నే బనాదీ జోడి' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన హాట్ బ్యూటీ. చూపుల్లో చురుకుతనం, నవ్వులో కొంటెతనం...మాటల్లో అమాయకత్వం...అన్నీ కలిపితేనే అనుష్క శర్మ. సాధారణంగా పెళ్ళయిన తరువాత హీరోయిన్లు కాస్త బ్రేక్ తీసుకుంటారు. కానీ అనుష్క మాత్రం ఇంకా బిజీ అయ్యిందనే చెప్పాలి. ఓ వైపు సినీ నిర్మాణం, మరోవైపు సినిమా, భర్త విరాట్ పనులు, క్లాత్ బిజినెస్ ఇలా బిజీబిజీగా ఉండే అనుష్కకి ఇటీవలి కాలంలో కాస్త విరామాన్ని తీసుకోవాలనుకుంటోందట. అయితే పిల్లల్ని కనడానికే అనుష్క బ్రేక్ తీసుకుంటోందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇటీవల ఆమె హాట్ కామెంట్స్ చేసింది.

‘నేను డబ్బులను సంపాదించడానికి సినిమాల్లోకి రాలేదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడే కాదు.. మొదటి నుంచీ నేను డబ్బుల కోసం సినిమాలు చేయలేదు. నేను సినిమాలు చేయడం లేదంటే.. నాకు నచ్చిన కథ దొరకడం లేదని అర్థం. ఇప్పుడు డబ్బులు కోసమని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవల్సిన అవసరం లేదు. నాకు సినిమాలతో పాటు చాలా పనులున్నాయి. నచ్చిన కథ దొరికితే నేను నటించడమే కాదు.. నిర్మించడానికి కూడా నేను సిద్ధం. అలాగే నేను తల్లిని కావడానికే విరామం తీసుకున్నానని.. చాలా వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. నటిస్తూ కూడా పిల్లల్ని ప్లాన్‌ చేసుకోవచ్చు. నేను పిల్లల్ని కనడానికి ఇంకా సమయముంది. అయినా ఎప్పుడు పిల్లల్ని కనాలన్నది నా వ్యక్తిగతం. ఆ విషయంలో ఇతరులకు ఆసక్తి అవసరం లేదు..’’ అని అనుష్క శర్మ తెలిపింది.