Begin typing your search above and press return to search.

అనుష్క సిగ్గు పడమంటోంది

By:  Tupaki Desk   |   11 Feb 2017 6:41 PM IST
అనుష్క సిగ్గు పడమంటోంది
X
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కొత్త సినిమా వచ్చేస్తోంది. ఫిలౌరీ అనే మూవీలో దెయ్యంగా కనిపించనున్న అనుష్క.. ఆ మూవీని తనే నిర్మించేసింది కూడా. అయితే.. ఈ చిత్ర నిర్మాణానికి అనుష్క లవర్ విరాట్ కోహ్లీ డబ్బులు పెట్టాడంటూ ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల పాటు వీటిపై సైలెంట్ గా ఉన్న అనుష్క.. ఇప్పుడు ఓ ఘాటు లెటర్ ద్వారా సూటిగా తిట్టిపోసింది.

'ఫిలౌరి చిత్రాన్ని ఫాక్స్ స్టార్ హిందీ.. క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ నిర్మించాయి. వేరే ఏదో చెబుతున్న టీవీ ఛానల్స్.. న్యూస్ పేపర్స్.. వెబ్ సైట్స్ వాస్తవాలు తెలుసుకోవాలి. బాధ్యతాయుతమైన జర్నలిజం నేర్చుకోండి. కాసింత సిగ్గు తెచ్చుకోండి. సోర్స్ అంటూ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లు రాయడం సరికాదు. నేను ఏళ్లతరబడి చాలా కష్టపడి ఈ స్థాయిలో ఉన్నాను. వాస్తవాలను చెప్పేందుకు పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది. ఫేక్ సోర్స్ ల పేరుతో రాసే రాతలకు లెక్కలుండవు' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది అనుష్క.

తనకు తానుగా సినిమా నిర్మాణం చేయగలనని చెప్పిన ఈమె.. మహిళా అభ్యుదయం అనే వాళ్లు వాటికి దగ్గరగా రాతలు రాయాలని చెప్పింది. తన సినిమాలు నిర్మించుకోవడానికి.. ప్రమోట్ చేసుకోవడానికి తనకు శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని చెప్పింది అనుష్క శర్మ.