Begin typing your search above and press return to search.

ట్యాక్స్ తంటా.. నోటీసుపై హీరోయిన్ హైకోర్టుకు!

By:  Tupaki Desk   |   13 Jan 2023 3:29 AM GMT
ట్యాక్స్ తంటా.. నోటీసుపై హీరోయిన్ హైకోర్టుకు!
X
బాలీవుడ్ అందాల క‌థానాయిక అనుష్క శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. క్రికెట్ స్టార్ విరాట్ ని పెళ్లాడి విరుష్క‌గా పాపుల‌రైంది. ఇటీవ‌లే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌రోవైపు న‌టిగా తిరిగి ఘ‌న‌మైన పున‌రారంగేట్రం కోసం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇంత‌లోనే విలువ ఆధారిత ప‌న్ను వ్య‌వ‌హారంలో కోర్టు నుంచి ఒక నోటీసు కూడా అందుకుంది.

త‌న‌పై అన‌వ‌స‌రంగా అద‌న‌పు పన్ను భారం మోపార‌ని వాదిస్తూ త‌న‌కు అందిన‌ నోటీసుపై అనుష్క శర్మ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర విలువ ఆధారిత పన్ను (MVAT) చట్టం కింద 2012-13 అలాగే 2013-14 బకాయిలపై సేల్స్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన రెండు ఉత్తర్వులను సవాలు చేస్తూ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. న్యాయమూర్తులు నితిన్ జామ్దార్- అభయ్ అహుజాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈరోజు ఆమె అప్పీల్ పై స్పందించాలని సేల్స్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది. ఈ అంశంపై ఫిబ్రవరి 6న మరోసారి విచారణ జరగనుంది.

2012-13లో అనుష్క అందుకున్న రూ. 12.3 కోట్లపై అథారిటీ రూ. 1.2 కోట్ల అమ్మకపు పన్ను (వడ్డీతో సహా) విధించింది. ఇదిలా ఉండగా 2013-14కి సంబంధించి ఆమె అందుకున్న రూ.17 కోట్లకు రూ.1.6 కోట్ల పన్ను విధించారు. అంతకుముందు 2012 - 2016 మధ్య నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది.

తన పిటిషన్ లో న‌టి కం ఎంట‌ర్ ప్రెన్యూర్ అనుష్క శ‌ర్మ‌ ఎండార్స్ మెంట్ ల ద్వారా అవార్డు ఫంక్షన్‌లకు యాంకరింగ్ చేయడం ద్వారా కాపీరైట్ ను పొందిందని దానిని విక్రయించడం లేదా బదిలీ చేసినట్లు అధికారులు 'తప్పు'గా గుర్తించార‌ని అనుష్క శ‌ర్మ త‌న పిటీష‌న్ లో పేర్కొంది.

మరోవైపు ఆమె న్యాయవాది దీపక్ బాపట్ మాట్లాడుతూ.. షోల నిర్మాతలు ఎల్లప్పుడూ సంబంధిత వీడియోల కాపీరైట్ ను కలిగి ఉంటారని దానిని విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ''MVAT చట్టంలోని సెక్షన్ 6(1) వస్తువుల అమ్మకాల టర్నోవర్ పై అమ్మకపు పన్ను విధించే హ‌క్కు ఉంద‌ని కూడా ఆ పిటిషన్ పేర్కొంది. అందువల్ల వస్తువుల అమ్మకం ఉందని నిర్ధారించకపోతే దానిపై అమ్మకపు పన్ను విధించకూడదు.

అనుష్క శ‌ర్మ‌ ఇంతకుముందు డిసెంబర్ 2022లో తన టాక్సేషన్ కన్సల్టెంట్ ద్వారా ఈ పిటిషన్ ను దాఖలు చేసారు. అయితే జస్టిస్ జామ్ దార్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ ను త్రోసిపుచ్చింది. అయితే ఆమె తన స్వంత ధృవీకరణపై మళ్లీ దాఖలు చేయడానికి అనుమతించింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.