Begin typing your search above and press return to search.

#మ‌మ్మీ అనుష్క‌...పాలు తాగాక‌ బేబీకి త్రేన్పు తీపించ‌డ‌మెలా?

By:  Tupaki Desk   |   8 Feb 2021 9:40 AM IST
#మ‌మ్మీ అనుష్క‌...పాలు తాగాక‌ బేబీకి త్రేన్పు తీపించ‌డ‌మెలా?
X
అమ్మ‌త‌నంలో క‌మ్మ‌ద‌నం ఆస్వాధిస్తోంది అనుష్క‌శ‌ర్మ‌. ప్ర‌స్తుతం త‌న బేబి `వామిక` ఆల‌నాపాల‌న‌తోనే బిజీ అయిపోయింది. ఆ మ‌ధురిమ‌ల్ని ఎంత‌గానో ఆస్వాధిస్తోంది. బి-టౌన్ కొత్త మమ్మీ అనుష్క శర్మ త‌న లైఫ్ ఫ‌న్ ని ఇన్ స్టాగ్రామ్ లో చమత్కారమైన వినోదాత్మక పోస్ట్ తో వైర‌ల్ చేస్తోంది.

ఇదిగో ఇలా భుజంపై బ‌ర్ప్ క్లాత్ (బేబీకి ఉప‌యోగించేది) వేసుకుని.. ఎంతో ఫ‌న్నీ క్యాప్షన్ ‌తో సెల్ఫీని పంచుకుంది. ``ప్రస్తుత ఇష్టమైన అనుబంధ - బర్ప్ క్లాత్`` అన్న వ్యాఖ్యను జోడించింది. అనుష్క అద్దం ముందు పోజులిస్తూ క‌నిపించింది. బ‌ర్ప్ క్లాత్.. అంటే శిశువు పాలు తాగిన అనంత‌రం భుజం మీద వేసుకుని త్రేన్పు తీయించేందుకు విశ్రాంతికి ఉప‌క‌రిస్తుంది. నవజాత శిశువుతో బిజీగా ఉన్న‌ మామ్ అనుష్క.. అభిమానులను నవ్వించడానికి కొంత సమయం కేటాయిస్తున్నారు.

ప్రసవానంతరం కూడా అనుష్క ఎంతో ఆరోగ్యంగా కనిపించ‌డం వెన‌క ర‌హ‌స్యం ఇదేనేమో! కొత్త మ‌మ్మీ లైఫ్ అయినా త‌న‌లో ఎక్క‌డా అల‌స‌ట లేదు. నిద్ర లేమి అస‌లే క‌నిపించ‌డం లేదు.

విరుష్క జోడీ గత నెలలోనే తమ న‌వ‌జాత శిశువును స్వాగతించారు. శిశువుకు `వామికా` అని పేరు పెట్టారు. ఈ జంట ఇంకా వామిక క్యూట్ ఫేస్ ఎలా ఉందో అభిమానుల‌కు రివీల్ చేయ‌లేదు. అభిమానులు ఆ క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.