Begin typing your search above and press return to search.

షాక్‌: మొన్న‌నే బిడ్డ‌ను కంది! ఈలోగానే మొద‌లెట్టేస్తోంది!!

By:  Tupaki Desk   |   20 Feb 2021 12:03 PM IST
షాక్‌: మొన్న‌నే బిడ్డ‌ను కంది! ఈలోగానే మొద‌లెట్టేస్తోంది!!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వార‌సురాలికి వామిక కోహ్లీ అని నామ‌క‌ర‌ణం చేశారు. వామిక ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. ఇక‌పోతే ఏడాది కాలంగా ఈ భామ సినిమాల‌కు దూరంగ ఉంది. ఇక పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోందా? అంటే.. తాజాగా దానికి ఆన్స‌ర్ వ‌చ్చేసింది.

ఫ్రెగ్నెన్సీ వ‌ల్ల‌నే ఇన్నాళ్లు కుద‌ర‌లేదు. ఇక పై కొత్త సినిమాల్ని ప్రారంభించ‌నుంద‌ట‌. అలాగే నిర్మాత‌గానూ ఫుల్ స్వింగ్ లోకి వ‌చ్చేస్తున్నార‌ని తెలిసింది‌. అతి త్వరలోనే ఒక‌ కొత్త చిత్రాన్ని నిర్మించటానికి అనుష్క‌ సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి `ఆఫ్ఘన్` అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. అన్షాయ్ లాల్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

నిర్మాత‌గా అనుష్క తొలి నుంచి ప్ర‌యోగాలు చేస్తున్నారు. అసాధార‌ణ‌ విజ‌యాలు అందుకుంటున్నారు. ఈసారి కూడా మంచి టైటిల్ తో కాన్సెప్ట్ ఉన్న సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్ టైనర్లో ప్రముఖ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మొన్న‌నే బిడ్డ‌ను కంది! ఈలోగానే మొద‌లెట్టేస్తోందా! అంటూ ఫ్యాన్స్ షాక్ కి గుర‌వుతున్నారు. బెబో క‌రీనా క‌పూర్ కూడా ఇంత‌కుముందు ఫ్రెగ్నెన్సీతో షూటింగుల‌కు అటెండ‌వ్వ‌డం షాకిచ్చింది.