Begin typing your search above and press return to search.

పెళ్ళి పెళ్లే.. మెరుపులు మెరుపులే

By:  Tupaki Desk   |   13 Feb 2018 9:37 AM IST
పెళ్ళి పెళ్లే.. మెరుపులు మెరుపులే
X
ఎవరన్నారండీ.. పెళ్లి చేసుకున్నాక గ్లామర్ గా కనిపించడం కష్టం అని? ఒక్కసారి బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఎలాంటి డ్రెస్సులతో అలరిస్తోందో పరికిస్తే.. ఇలాంటివన్నీ ఒట్టి భ్రాంతులే అని అర్ధమవుతుంది. బాలీవుడ్ గ్లామర్ భామల్లో అనుష్క శర్మ కూడా ఒకరు. కానీ రీసెంట్ గా విరాట్ కోహ్లీతో పెళ్లి చేసుకుంది ఈ భామ.

మరి పెళ్లి తర్వాత ముందటి మాదిరిగా తన సోయగాల మెరుపులను అభిమానులకు చూపిస్తుందో లేదో అనే డౌట్స్ చాలానే వినిపించాయి. ఇలాంటి వాటిని బ్రేక్ చేసేందుకు పెద్దగా టైం కూడా తీసుకోలేదు ఈ బ్యూటీ. పట్టుమని రెండు నెలలు తిరగకుండానే రకరకాల రివీలింగ్ డ్రెస్సులను వేసి అలరించేస్తోంది. ప్రస్తుతం పరి సినిమా ప్రచారం కోసం తెగ పర్యటనలు చేసేస్తున్న ఈ బాలీవుడ్ పోరి.. ఓ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో సందడి చేసింది. వెనుక వైపు అందాలను బాగా ప్రదర్శిస్తున్న ఈ దుస్తులు.. అమ్మడి సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపచేసేశాయి.

కేవలం స్క్రీన్ పైనే కాకుండా.. ప్రచార కార్యక్రమాల్లో కూడా గ్లామర్ కురిపిస్తున్న అనుష్క శర్మను చూసి.. అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పెళ్లి తర్వాత ఇలాంటి మెరుపులు ఉండవేమో అని భయపడినవారికి సమాధానం బాగానే దొరికేసింది. పెళ్లి పెళ్లే.. మెరుపులు మెరుపులే అనే విషయాన్ని ఇంతకంటే క్లియర్ కట్ గా చెప్పడం మరెవరి వల్లా కాదేమో కదూ.