Begin typing your search above and press return to search.

కోహ్లీ చేసిన పనికి మురిసి పోతున్న అనుష్క

By:  Tupaki Desk   |   10 Jun 2019 10:22 AM GMT
కోహ్లీ చేసిన పనికి మురిసి పోతున్న అనుష్క
X
ఇటీవల ఇంగ్లాండ్‌ లో జరిగిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియాతో ఇండియా ఢీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో టీం ఇండియా గెలిచింది. అయితే ఇప్పుడు ఆ విషయం కంటే మ్యాచ్‌ సందర్బంగా కోహ్లీ వ్యవహరించిన తీరు గురించి చర్చనీయాంశం అవుతోంది. ఆస్ట్రేలియన్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ నేరం కింద సంవత్సరం పాటు బహిష్కరణకు గురయ్యాడు. మళ్లీ ఇప్పుడు స్టీవ్‌ స్మిత్‌ ప్రపంచ కప్‌ మ్యాచ్‌ లు ఆడుతున్నాడు.

స్టీవ్‌ స్మిత్‌ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ లో కూడా క్రీడాభిమానుల నుండి చేదు అనుభవంను ఎదుర్కొంటున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్‌ లో కూడా టీం ఇండియా సపోర్టర్స్‌ స్టీవ్‌ స్మిత్‌ ను పెద్ద ఎత్తున ఛీటర్‌ చీటర్‌ అంటూ అరవడం మొదలు పెట్టారు. దాంతో స్మిత్‌ కాస్త ఇబ్బంది ఫీల్‌ అయ్యాడు. విషయంను గమనించిన కోహ్లీ అభిమానులను సున్నితంగా హెచ్చరించి.. వారిని అభినందించాల్సిందిగా సూచించాడు. కోహ్లీ సూచించిన వెంటనే ఛీటర్‌ అంటూ నినాదాలు చేస్తున్న వారు మౌనం వహించారు. ప్రత్యర్థి జట్టు వారిని మాటలతో మానసికంగా హింసించే ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ ను జనాలు నినాదాలతో వేదిస్తుంటే కోహ్లీ వారిని వారించడం అందరిని మెపిస్తుంది.

తన భర్త గ్రౌండ్‌ లో ప్రవర్తించిన తీరును అనుష్క ఆకాశానికి ఎత్తుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇది విరాట్‌ అంటూ ఆమె ఇన్‌ స్టాలో ఆ సంఘటనకు సంబంధించిన విజువల్‌ ను పోస్ట్‌ చేసింది. మొత్తానికి కోహ్లీని ప్రపంచం మొత్తం పొగుడుతున్న ఈ సమయంలో అనుష్క శర్మ చాలా సంతోషంగా ఉన్నట్లుగా ఆమె పోస్ట్‌ చూస్తుంటే అనిపిస్తుంది. చక్కని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన కోహ్లీ ది గ్రేట్‌ అంటూ అభిమానులు కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.