Begin typing your search above and press return to search.

హీరోయిన్ కి ఇలాంటి బాడీగార్డ్ ని పెట్టిన భ‌ర్త‌

By:  Tupaki Desk   |   13 Dec 2021 3:00 PM IST
హీరోయిన్ కి ఇలాంటి బాడీగార్డ్ ని పెట్టిన భ‌ర్త‌
X
బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ బాడీగార్డ్ త‌ర్వాత అత్యంత భారీ వార్షిక ప్యాకేజీ అందుకునే వాడిగా అనుష్క శ‌ర్మ బాడీగార్డ్ సోను రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్.. టీమిండియా ర‌ధ‌సార‌థి విరాట్ స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ బాడీగార్డ్ ప్రకాష్ సింగ్ అలియాస్ సోను అత్యంత‌ భారీ ప్యాకేజీ అందుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. అనుష్క శ‌ర్మ త‌న బాడీగార్డ్ కి ఏడాదికి 1.2 కోట్ల మేర ముట్ట‌జెబుతోంది. క‌థానాయిక‌ల్లో వ్య‌క్తిగ‌త సెక్యూరిటీకి అత్య‌ధిక చెల్లింపు ఇదే. అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ జంట‌ నగరంలో షికార్లు చేసేప్పుడు లేదా విదేశాలకు వెళ్ళిన ప్రతిసారీ సెక్యూరిటీ బృందం ప్ర‌తిదీ అదుపులో ఉండేలా చూస్తారు.

దేశంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ క‌పుల్ గా పాపుల‌రైన‌ ఆ ఇద్ద‌రికీ భారీగా అభిమానులు ఉన్నారు. అభిమానులు వారితో ఫోటోలు సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ‌తారు. అలాంటి స‌మ‌యంలో ఎలాంటి గంద‌ర‌గోళం త‌లెత్త‌కుండా అనుష్క వ్యక్తిగత బాడీగార్డ్ సోను ఆమెకు విరాట్ కోహ్లీకి ఒక సైనికుడిలా ప‌ని చేస్తారు. అతను కెరీర్ ఆద్యంతం అనుష్క శ‌ర్మ‌కు సెక్యూరిటీగా ఉన్నారు. విరాట్ ను అనుష్క‌ వివాహం చేసుకోకముందే అతను ఆమెకు గార్డ్‌.

ప్రకాష్ సింగ్ అలియాస్ సోనుకు అనుష్క భారీ మొత్తంలో జీతం చెల్లిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం సోను వార్షిక వేతనం రూ. సుమారు 1.2 కోట్లు. అతను ముంబైలో అత్యధికంగా పారితోషికం అందుకునే సెల‌బ్రిటీ బాడీగార్డ్ లలో ఒకడు అని క‌థ‌నం వెల్ల‌డించింది. అనుష్క తన బాడీగార్డ్ ను త‌న కుటుంబ స‌భ్యుడిగా భావించి గౌర‌విస్తారు. అత‌డు కూడా ఆ కుటుంబంతో అంతే ఇదిగా క‌లిసిపోయి ప‌ని చేస్తారు.

2017 డిసెంబర్ 11న విరుష్క పెళ్ల‌యింది. గ‌త‌ శనివారం వివాహ వార్షికోత్స‌వం జ‌రిగింది. ఈ సందర్భంగా కోహ్లీ షేర్ చేసిన ఫోటోల్లో గార్డ్ సోను ఎంతో ప్రొటెక్టివ్ గా క‌నిపించాడు. సోనూ బ‌లాడ్యుడు. ప‌దిమందిని ఒకేసారి ఆప‌గ‌ల‌డన్న ధీమా క‌నిపిస్తోంది. విరుష్క‌కు కూతురు వామిక పుట్టిన తర్వాత ఇది మొద‌టి యానివర్సరీ. మునుముందు సోను ఈ జంట‌కు వ్య‌క్తిగ‌త సెక్యూరిటీగా విశేష సేవ‌లందించేందుకు సిద్ధంగా ఉన్నాడు.