Begin typing your search above and press return to search.

కోహ్లీ-అనుష్కల బాడీ గార్డ్ జీతం ఎంతంటే?

By:  Tupaki Desk   |   15 July 2021 3:09 PM GMT
కోహ్లీ-అనుష్కల బాడీ గార్డ్ జీతం ఎంతంటే?
X
సెలబ్రెటీలు ఇంటి నుంచి జనారణ్యంలోకి వస్తే జనాలు చుట్టుముట్టేస్తారు. ఫొటోలు, ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలంటూ హీరో, హీరోయిన్ల మీద పడుతారు. అందుకే సినీ సెలబ్రెటీలు అంతా తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండటానికి ఎల్లప్పుడూ గట్టి భద్రత కలిగి ఉంటారు. కొంతమంది స్టార్ హీరోలు అయితే ఏకంగా సొంతంగా బాడీగార్డ్ లను పెట్టుకుంటారు. వారు సంవత్సరాలుగా తమ హీరోలు, హీరోయిన్లకు సేవ చేస్తారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్కశర్మకు సైతం అలా చాలా రోజులుగా వెన్నంటి ఉండే ఒక బాడీగార్డ్ ఉన్నాడు. ఆమెతో చాలా సంవత్సరాలుగా అతడు కనిపిస్తూనే ఉంటాడు.

అనుష్క బాడీగార్డ్ పేరు ప్రకాష్ సింగ్ అకాసోను.ఇతడు అనుష్క కెరీర్ ప్రారంభం నుంచి ఆమెతో కలిసి పనిచేస్తున్నారు. బాలీవుడ్ మీడియా వర్గాల కథనం ప్రకారం అతడికి సంవత్సరానికి అనుష్క ఇచ్చే జీతం రూ.1.2 కోట్లు.

అంటే దేశంలోని వివిధ కంపెనీల సీఈవోల కంటే కూడా ప్రకాష్ సింగ్ జీతం ఎక్కువ. అనుష్క ఎప్పుడూ ప్రకాష్ సింగ్ నుసోనూను తన బాడీగార్డ్ గా భావించలేదని.. అతడిని కుటుంబ సభ్యుడిగా ఎప్పుడూ చూస్తారని చెబుతారు. ఆమె ప్రతి సంవత్సరం అతడి పుట్టినరోజును కూడా జరుపుతుంటుందట..

ఇక పెళ్లి అయ్యాక కూడా అనుష్క భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో కలిసి బహిరంగంగా బయటకు వచ్చినప్పుడూ కూడా ప్రకాష్ సింగ్ సోనూ తరుచుగా కనిపిస్తాడు. విరాట్-అనుష్క ఇద్దరూ ప్రకాస్ ను చాలా గౌరవంగా చూస్తారు.

కోవిడ్-19 సోకి ఆస్పత్రికి చేరినప్పుడు.. అనుష్కకు గర్భాధారణ సమయంలోనూ ప్రకాష్ చాలా బాగా అనుష్కను చూసుకున్నట్లు తెలిసింది. అతడు పీపీఈ కిట్ ధరించి మరీ కరోనా సోకిన అనుష్క-విరాట్ లను ఆస్పత్రికి తీసుకెళ్లాడట..అలా ప్రాణాలకు తెగించి మరీ అనుష్క-విరాట్ లకు అండగా నిలబడుతాడట ప్రకాష్. అందుకే అతడి కోసం ఏమైనా చేస్తారట వీరిద్దరూ.

ఇక సినిమాల విషయానికి వస్తే అనుష్క చివరిసారిగా 2018లో జీరో సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్రముఖ భారత క్రికెటర్ జులాన్ గోస్వామి బయోపిక్ కోసం పనిచేస్తోంది.