Begin typing your search above and press return to search.

కుమార్తె బ‌ర్త్ డే లో అనుష్క వైన్ పార్టీ..

By:  Tupaki Desk   |   13 Jan 2022 3:30 AM GMT
కుమార్తె బ‌ర్త్ డే లో అనుష్క వైన్ పార్టీ..
X
విరాట్ కొహ్లీ సౌతాఫ్రికా టూర్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణి అనుష్క అక్క‌డే ఉంది. ఇండియా - సౌత్ ఆఫ్రికా మ్యాచుల్ని ఆస్వాధిస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా సౌత్ ఆప్రికా టూర్ ఫోటోల్ని పంచుకుంది. తాజాగా విరుష్క జంట గారాలప‌ట్టి వామిక తొలి బ‌ర్త్ డే జ‌న‌వ‌రి 11న సౌత్ ఆఫ్రికాలో సెల‌బ్రేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వామిక పుట్టిన రోజు వేడుక‌లు టీమ్ ఇండియా స‌భ్యుల‌తో క‌లిసి విరుష్క జంట ఘ‌నంగా జ‌రుపుకుంది. సెల‌బ్రేష‌న్స్ స‌మ‌యంలో విరుష్క వైన్ గ్లాస్ ల‌తో కెమారాకి ఫోజులిచ్చారు.

``సూర్యుడు ప్ర‌కాశవంతంగా ఉన్నాడు. లేలేత అంద‌గాడిలా మెరిసిపోతున్నాడు. టేబుల్ నిండుగా ఉంది. మా పాప కూడా అలా మారిపోయింది. సాయంత్రం స్పెష‌ల్ పార్టీ చాలా బాగా జ‌రిగింది`` అని అనుష్క తెలిపింది. అలాగే జంట పార్టీకి విచ్చేసిన అతిధులంద‌రికీ కృతజ్ఞ‌త‌లు తెలిపింది. అనుష్క వామిక‌ను త‌న చేతుల్లోకి తీసుకుని త‌ల్లిగా న‌వ్వుతూ తెగ మురిసిపోయింది. ఆ ఫోటోని ఉద్దేశించి ``నా పాప‌`` అని క్యాప్ష‌న్ ఇచ్చింది. అయితే బ‌ర్త్ డేకి సంబంధించిన ఫోటోల్ని ఎవ‌రూ క్యాప్చ‌ర్ చేయ‌వ‌ద్ద‌ని ముందుగానే హింట్ ఇచ్చేసారు. ఇది కేవ‌లం పార్టీ.. సెల‌బ్రేష‌న్ మాత్ర‌మేన‌ని తెలుస్తోంది.

అనుష్క మాతృమూర్తిగా మారిన ద‌గ్గ‌ర నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటుంది. కుటుంబ జీవితాన్నే ఆస్వాధించ‌డానికి ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతోంది. విరాట్ ఏ దేశం వెళ్లినా అనుష్క సైతం అక్క‌డే ఉంటుంది. మీడియా ఇంట‌ర్వ్యూల‌కు పెద్ద‌గా హాజ‌రు అవ్వ‌డం లేదు. వామిక పుట్టిన త‌ర్వాత స‌మ‌య‌మంతా పాప‌తోనే స‌రిపోతుంద‌ని ఆ మ‌ధ్య ట్వీట్ చేసింది. పాప ఉన్న చోటు క‌న్నా గొప్ప జీవితం ఇంకెక్క‌డా? అంటూ త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట పెట్టింది.