Begin typing your search above and press return to search.
ఔను నమ్మండి.. మన అనుష్కే
By: Tupaki Desk | 16 May 2016 9:50 AM ISTక్యారెక్టర్ కోసం హీరోయిన్లు అవసరమైతే బరువు తగ్గుతారు కానీ.. పెరగడానికి అస్సలు ఇష్టపడరు. అందులోనూ ఒకేసారి 20 కిలోల బరువు పెరగాలి అంటే పారిపోతారు. కానీ అనుష్క మాత్రం ఇండియాలో మరే హీరోయిన్ చేయని సాహసం చేసింది. ‘సైజ్ జీరో’ కోసం ఎంతో కష్టపడి 20 కిలోల దాకా బరువు పెరిగింది. బరువు పెగరడం తగ్గడం ఎంతో కష్టంతో కూడుకున్న పనైనా.. తన ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసినా.. తన కెరీర్ కు సైతం ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదమున్నా.. ఆమె వెనక్కి తగ్గలేదు. ‘సైజ్ జీరో’ రిజల్ట్ తేడా వచ్చినా సరే.. ఆ నిరాశలో కూరుకుపోకుండా మళ్లీ తన తర్వాతి సినిమాల కోసం బరువు తగ్గే పనిలో పడింది.
ఐతే చివరగా భారీ అవతారంలో కనిపించి మాయమైన అనుష్క.. మళ్లీ బరువు తగ్గాక తన రూపాన్ని ఎవ్వరికీ చూపించలేదు. ఎట్టకేలకు తన కొత్త అవతారాన్ని జనాలకు పరిచయం చేసింది అనుష్క. ఈ మధ్యే షూటింగులకు విరామం ఇచ్చేసి బెంగళూరులోని తన ఇంట్లో జరిగే ఓ వేడుక కోసం వెళ్లింది అనుష్క. ఆ సందర్భంగా తన అన్నయ్యతో కలిసి దిగిన ఫొటోను అనుష్క ఫేస్ బుక్ పేజీలో పెట్టింది.
నేను బరువు తగ్గాను చూడండోచ్ అని అనుష్క క్యాప్షన్ ఏమీ పెట్టకపోయినా.. అనుష్కలో వచ్చిన మార్పు ఈ ఫొటోలో స్పష్టంగా కనిపించింది. ఇది ఫుల్ సైజ్ ఫొటో కాకపోయినా.. అనుష్క బరువు తగ్గి మునుపటి రూపానికి వచ్చేసిందని ఆమె ముఖం చూస్తేనే అర్థమైపోతోంది. కాబట్టి బాహుబలి-2తో పాటు సింగం-3లోనూ అనుష్కను మునుపటిలా అందంగా చూడొచ్చన్నమాట.