Begin typing your search above and press return to search.
అవికా గోర్ తర్వాత ఇంకో టీనేజీ టీవీ నటి పెద్దతెరపైకి!
By: Tupaki Desk | 16 Feb 2021 8:00 AM ISTప్రముఖ టీవీ నటి.. బాలనటి అవికా గోర్ యుక్తవయసులో కథానాయికగా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో తొలి ప్రయత్నమే ఉయ్యాల జంపాల చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని వరుసగా సినిమాలకు కమిటైంది. ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత ఈ అమ్మడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. అవికా గోర్ తరహాలోనే ఈ పరిశ్రమలో ఎందరో ఉన్నారు.
ఇప్పుడు అదే బాటలో మరో హిందీ సీరియల్ టీనేజీ నటి పెద్ద తెర ప్రయత్నాల్లో ఉండడం హాట్ టాపిక్ గా మారింది. `బాల్ వీర్`..`ఝాన్సీ కి రాణి` సీరియళ్లతో గొప్ప పాపులారిటీ సంపాదించిన యువ టెలివిజన్ నటి అనుష్క సేన్ త్వరలోనే పెద్ద తెర ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ నివేదికల ప్రకారం ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ యువ ప్రతిభావనితో చర్చలు జరుపుతోందని తెలిసింది. అనుష్క సేన్ బాలీవుడ్ అరంగేట్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
ఇప్పటికే ఈ టీనేజీ బ్యూటీకి సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అనుష్క సేన్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. ఇది తనకు ఉన్న ప్రజాదరణను ప్రూవ్ చేస్తోంది.