Begin typing your search above and press return to search.

స్టాఫ్‌ అందరినీ తీసేసిన అనుష్క

By:  Tupaki Desk   |   1 May 2017 10:02 AM IST
స్టాఫ్‌ అందరినీ తీసేసిన అనుష్క
X
సీనియర్ హీరోయిన్ అనుష్క.. ఏకంగా 2005 నుండి టాలీవుడ్ లో పాగా వేసింది. అప్పటినుండి అంచలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు బాహుబాలి 2 సినిమాతో భారీ సక్సెస్ నే చూసింది. అయితే ఈ సుందరి చాలా కాలం నుండి తన దగ్గర అదే స్టాఫ్‌ ను మెయిన్టయిన్ చేస్తోంది. కాని ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో.. అందరికీ ఒకేసారి షాక్ ఇచ్చింది.

ఫిలిం ఇండస్ర్టీలో వినిపిస్తున్న గాసిప్ ప్రకారం చూస్తే.. అనుష్క తన తగ్గర పనిచేసే నలుగు పర్సనల్ స్టాఫ్‌ అందరినీ ఒకేసారి తీసేసింది. మే 1వ తారీఖు నుండి వారందరినీ పనిలోకి రావద్దని చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అనుష్క కొత్త స్టాఫ్‌ ను పెట్టుకోనుందా? అంటే ఇంకా ఆ విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఇతర సినిమాల షూటింగ్ ను పూర్తి చేసే యొచనలో ఉన్న అనుష్క.. ఆ తరువాత సినిమాల్లో నటించదా? అందుకే ఇప్పుడు స్టాఫ్‌ ను తీసేసిందా?

ఇదే విషయం ఆమె సన్నిహితులను అడిగితే.. అనుష్క మీద ఒక గాసిప్ బయటకు వెళ్ళడం వలన హర్టయ్యి.. ఆమె తన టీమ్ మారుస్తోందని.. కొత్తవారిని త్వరలోనే పనిలో పెట్టుకుంటుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఆ గాసిప్ ఏంటో మరి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/