Begin typing your search above and press return to search.
మెగా ఆఫర్ పై అనుష్క వెనక్కి తగ్గిందా?
By: Tupaki Desk | 17 March 2020 8:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ సినిమాకి హీరోయిన్ గా ఎంపికైన త్రిష సడెన్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి కి సారీ చెప్పి అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్ లో ప్రకటించి ట్విస్ట్ ఇచ్చింది. మరి ఈ కొంటె కోనంగి ఎగ్జిట్ కి అసలు కారణం ఏమిటన్నది తెలియదు గానీ... సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఇద్దరు బిగ్ స్టార్లు కలిసి నటిస్తే హీరోయిన్ గా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని త్రిష తప్పుకుందన్న ప్రచారం హైలైట్ అయింది. కారణాలు ఏవైనా త్రిష తప్పుకున్న నాటి నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? అన్న చర్చా సాగుతోంది.
అయితే కొరటాల మరో ఆలోచనే లేకుండా వెంటనే అనుష్క అయితే పక్కాగా సరిపోతుందని చిరంజీవి...చరణ్ ల దృష్టికి తీసుకెళ్లాడుట. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనుష్క వద్దకు విషయం చేరింది. అయితే స్వీటీ ఇంకా ఏదీ తేల్చలేదుట. అయితే మెగా ఛాన్స్ ని అనుష్క మిస్ చేసుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ల సరసన నటించేసినా.. చిరంజీవి...బాలకృష్ణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారుట. ఇప్పుడు మెగాస్టార్ సరసన నటించే ఛాన్స్ ఎలాగు వచ్చింది కాబట్టి నో చెప్పే ఛాన్స్ లేదు. అయితే పారితోషికం మాత్రం ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉంది.
బాహుబలి దేవసేనగా.. స్వీటీ పేరు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది కాబట్టి.. పారితోషికం ఆ రేంజులోనే డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. నిర్మాతలు పెద్ద ప్యాకేజీనే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిశబ్ధం రిలీజ్ కి వస్తోంది. దాని తర్వాత వేరొక కొత్త ప్రాజెక్ట్ కూడా ఏదీ కమిట్ కాలేదు. ఇంతలోనే చిరంజీవి సరసన నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ అభిమానుల్ని మరో సందేహం కూడా వెంటాడుతోంది. వాస్తవానికి చిరు 152ని ప్రకటించినప్పుడు తొలుత కథానాయికగా అనుష్క పేరే వినిపించింది. కానీ అనూహ్యంగా త్రిషను తెర మీదకు తీసుకొచ్చారు. కాబట్టి అనుష్క అలాంటి ఫీలింగ్స్ ఏమైనా మనసులో పెట్టుకుంటే గనుక చిరు కు హీరోయిన్ దొరకడం మళ్లీ కష్టమే అవుతుందన్న మాట వినిపిస్తోంది.