Begin typing your search above and press return to search.

ముద్దుకు నో అంటే నో అనేసిందట

By:  Tupaki Desk   |   12 July 2016 12:33 PM IST
ముద్దుకు నో అంటే నో అనేసిందట
X
రికార్డు కలెక్షన్లతో బాక్స్ ఫీస్ దుమ్ము రేపుతున్న సుల్తాన్ సినిమా సల్మాన్ కే కాదు అనుష్క శర్మకు మంచిపేరు తీసుకొచ్చింది. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఆమె నటన ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తటం తెలిసిందే. ఐదారు రోజులకేరూ.200 కోట్ల కలెక్షన్లును సాధించిన ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం మీద తాజాగా చర్చ జరుగుతోంది.

ఈ చిత్రంలో సల్మాన్.. అనుష్కల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి.. ఈ సన్నివేశాలు మరింత పండేందుకు ‘ముద్దు’లు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు అనుష్క ససేమిరా అన్నట్లుగా చెబుతున్నారు. కథకు తగ్గట్లుగా చూస్తే.. భావోద్వేగాల్ని మరింత పండించేందుకు ముద్దు సీన్లు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ.. అనుష్కశర్మ నో చెప్పటంతో అలాంటివేమీ లేకుండా బండిని లాగించేశారని చెబుతున్నారు.

అంతేకాదు.. సల్మాన్.. అనుష్కల మధ్యన వచ్చే రొమాంటిక్ సీన్ల విషయంలోనూ అనుష్క చాలా జాగ్రత్తగా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కోహ్లీతో ప్రేమాయణంలో ఉన్న అనుష్క ఆచితూచి వ్యవహరించిందన్న మాట ఉంది. దీనికి తగ్గట్లే సినిమాలోనూ ఎక్కడా ఇంటిమేటెడ్ సీన్లు లేకపోవటం గమనార్హం.