Begin typing your search above and press return to search.

అనుష్క కష్టాలు మళ్లీ మొదలు

By:  Tupaki Desk   |   18 July 2015 5:13 PM IST
అనుష్క కష్టాలు మళ్లీ మొదలు
X
హీరోలు ఎలా ఉన్నా చెల్లిపోతుంది కానీ.. హీరోయిన్లు కొంచెం షేప్ అవుట్ అయితే చాలు వాళ్ల పనైపోతుంది. ఆడియన్స్ నుంచి నెగెటివ్ కామెంట్స్ పడ్డాయంటే ఆ ఎఫెక్ట్ వెంటనే వాళ్ల కెరీర్ మీద పడిపోతుంది. అందుకే కోట్లు సంపాదిస్తున్నా కడుపు నిండా తినలేరు హీరోయిన్లు. వీక్లీ వన్స్ అయినా వెయిట్ చెక్ చేసుకుని.. ఏదైనా తేడాలొస్తే వెంటనే వర్కవుట్లు చేసి కొలతలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉంటారు హీరోయిన్లు. ఐతే డైరెక్టరే వచ్చి ఇంకా ఇంకా తిను.. బరువు పెరుగు తల్లీ అని అడిగితే అంతకంటే అదృష్టం ఏముంటుంది?

ఈ తరం హీరోయిన్లలో ఈ ఆఫర్ ఒక్క అనుష్కకు మాత్రమే దక్కింది. అఫ్ కోర్స్ అలాంటి క్యారెక్టర్ చేయడంలో రిస్క్ కూడా ఉందనుకోండి. అయినప్పటికీ ‘సైజ్ జీరో’ కోసం డేరింగ్ స్టెప్ వేసింది అనుష్క. మామూలుగానే కొంచెం బొద్దుగా ఉండే అనుష్క.. సైజ్ జీరో కోసం ఏకంగా 15 కిలోలు బరువు పెరిగింది. ఆ ఎఫెక్ట్ గత నెల రోజుల్లో కనిపించిన రెండు ఫంక్షన్లలోనూ స్పష్టంగా తెలిసిపోయింది. ఐతే అనుష్క తర్వాత కనిపించే ఫంక్షన్లో మాత్రం ఇలాగే ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే సైజ్ జీరో షూటింగ్ పూర్తయిపోయింది. ఈ మధ్యే ఫారిన్ షెడ్యూల్తో ‘సైజ్ జీరో’ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసిన ప్రకాష్ కోవెలమూడి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టాడు. కాబట్టి అనుష్క ఇక ఎంత పడితే అంత లాగించేసే ఛాన్స్ లేదు. మళ్లీ కడుపు మాడ్చుకోవాల్సిందే. వర్కవుట్లు చేయాల్సిందే. ఇంకో రెండు నెలల్లో ‘బాహుబలి’ పార్ట్-2 షూటింగ్ మొదలవబోతోంది. ఆ సమయానికల్లా మళ్లీ నాజూగ్గా తయారవ్వాలి. యోగా విద్యలో ఆరితేరిన అది మరీ కష్టమైన పనేమీ కాదు కానీ.. ఇన్నాళ్లూ తనకిష్టమైనవన్నీ ఆబగా ఆరగించి.. ఇప్పుడు నోరు కట్టేసుకోవాలంటే మాత్రం ఇబ్బందే కదా.