Begin typing your search above and press return to search.

‘ఫార్చ్యూన్​ ఇండియా’ జాబితాలో అనుష్క, ప్రియాంక, ఏక్తా!

By:  Tupaki Desk   |   12 Nov 2020 4:00 PM IST
‘ఫార్చ్యూన్​ ఇండియా’ జాబితాలో అనుష్క, ప్రియాంక, ఏక్తా!
X
ఫార్చ్యూన్​ ఇండియా మ్యాగజైన్​ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బాలీవుడ్​ బ్యూటీలు ప్రియాంకచోప్రా, అనుష్క శర్మ, ఏక్తా కపూర్​ చోటు దక్కించుకున్నారు. అయితే ఈ ముగ్గురు మహిళలు తమ సినిమా కెరీర్​తోపాటు వ్యాపారాలపైనా దృష్టి సారించారు. వీళ్లు ముగ్గురు ఏయే వ్యాపారాల్లో రాణిస్తున్నారో తెలుసుకుందాం..

ప్రియాంకా చోప్రా

బాలీవుడ్​ అందాల తార ప్రియాంకాచోప్రా.. ఫార్చూన్ 2020లో చోటుదక్కించుకున్నది. భారతీయ అత్యంత శక్తివంతమైన మహిళల్లో ప్రియాంకా చోప్రా 37వ స్థానంలో నిలిచారు.
38 ఏళ్ల ప్రియాంక నటిగానే కాక బిజినెస్​లోనూ రాణిస్తోంది. 2015లో ఆమె పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే కంపెనీని ప్రారంభించింది. గత ఏడాదిలో ఫోర్భ్స్ ఇండియా 2019 సెలబ్రిటీల 100 జాబితాలో తన వార్షిక సంపాదన 23.4 కోట్లతో ప్రియాంక చోటు దక్కించుకుంది. ఈ ఏడాదిలో నికర ఆదాయం 50 మిలియన్ డాలర్లుగా అంచనా.. వార్షిక ఆదాయం దాదాపు రూ. 73 కోట్లు ఉంటుందని అంచనా. సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక లాస్ ఏంజెలెస్ లో ఉంటుంది. ఆమె ఉంటున్న భవనం ఖరీదు రూ.144 కోట్లు.

అనుష్క శర్మ

2008లో రబ్​దే బనాదే జోడీ అప్నే సినిమాతో బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమె ఇండియాలో అత్యధిక సంపాదన ఉన్న సెలబ్రిటీల్లో ఒకరిగా నిలిచింది. సినిమాల్లోనే కాక సినీ నిర్మాణరంగంలోనూ ఆమె రాణిస్తున్నారు. 2013లో అనుష్క ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. టీం ఇండియా కెప్టెన్​ విరాట్​ను పెళ్లి చేసుకున్నాక ఆమె స్టార్​ మారిపోయింది. 2020 ఫిబ్రవరిలో తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి 2.2 కోట్ల పెట్టుబడితో ‘డిజిట్’ అనే ఇన్సూరెన్స్ స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఆమెకు ఆడి క్యూ8, లాండ్ రోవర్ రేంజ్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ముంబైలో 34కోట్ల లగ్జరీ ఇళ్లు ఉంది. గుర్గావ్​లో 80కోట్ల బహుళ అంతస్తు ఉన్నది.

ఏక్తా కపూర్​
భారత టెలివిజన్ యాక్టర్ ఏక్తా కపూర్.. టెలివిజన్, బాలీవుడ్​ ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నది. ఆమె బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు. 2012లో తన 36వ ఏటా ఫోర్భ్స్ ఏసియాలో శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నది. 2020లోనూ ఫార్చూన్ ఇండియాలో 2020 వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. బాలాజీ టెలిఫిల్మ్స్ లో ఉద్యోగులకు ఏటా 2.5 కోట్లతో తన సొంతడబ్బు ఇస్తూ ఆదుకుంటున్నది. అందుకే ఆమెకు ఫార్చూన్ ఇండియా జాబితాలో ఈ చోటు దక్కింది.