Begin typing your search above and press return to search.

బాహుబలి ఫస్ట్‌ షో టాక్‌: అమ్మో అనుష్క

By:  Tupaki Desk   |   10 July 2015 9:45 AM IST
బాహుబలి ఫస్ట్‌ షో టాక్‌: అమ్మో అనుష్క
X
ఒక మనిషిని వంద సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలంటే అతను వందేళ్లు బ్రతక్కక్కర్లేదు కాని, వంద మందికి ఉపయోగే పడే పని ఒక్కటి చేస్తే చాలు.. అంటూ చాలా సినిమాల్లో డైలాగులు విన్నాం. దానిని కాస్త మార్చి చెబితే, ఒక క్యారెక్టర్‌ సినిమాలో 2 గంటలు లేకపోయినా, రెండు నిమిషాలు కరెక్టుగా చేస్తే చాలు, ఆ ఇంపాక్ట్‌ అదిరిపోతుంది.

ఆల్రెడీ బాహుబలి తొలి భాగంలో అనుష్క ఎలా ఉండబోతోందో మనకు ముందే చూపించేశాడు రాజమౌళి. దేవసేన అంటూ మేకింగ్‌ వీడియోలో అందంగా చూపించి... ఇక్కడకు వచ్చేసరికి అందవికారంగా, శివుడు ప్రభాస్‌కు తల్లిగా, ఓ భానిసగా చూపించాడు. అయితే ఆమెను ఫస్ట్‌ టైమ్‌ చూసినప్పుడు పెద్దగా కిక్కులేదు కాని, మొదటిసారిగా సినిమాలో ఆమె మొత్తంగా తన ముఖం చూపించినప్పుడు మాత్రం ధియేటర్‌ మార్మోగిపోయింది. ఒక్క చూపుతో పిచ్చెక్కిచ్చింది అనుష్క. కొడుకు వచ్చాడనే సంతోషంతో, కక్ష తీరుతుందనే ఒక రకమైన ఆనందంతో ఆమె తన ముఖంలో ప్రతిధ్వనింపజేసిన ఆ ఎక్స్‌ప్రెషన్లు చూస్తే.. అమ్మో అనుష్క వాటే టాలెంట్‌ అనక మానరు.

జేజెమ్మను సీరియస్‌కు తీసుకోవాల్సిందే. ఆమె తొలి భాగంలో కేవలం 10 నిమిషాలే కనిపించినా కూడా.. అది అత్యధ్బుతంగా ఉంది. ఆ పాత్రను రాజమౌళి ఓ రేంజులో తీర్చిదిద్దాడు. కాని అసలు ఆమెకు ఏమైంది అనే విషయం తెలియాలంటే సెకండ్‌ పార్ట్‌ చూడాల్సిందే.