Begin typing your search above and press return to search.

చకాచకా ముగుస్తున్న సైజ్‌ జీరో

By:  Tupaki Desk   |   4 July 2015 5:00 PM IST
చకాచకా ముగుస్తున్న సైజ్‌ జీరో
X
పేరుకి తగ్గట్టే 'అనుష్క' చాలా స్వీటు అని కాంప్లిమెంట్‌ ఇచ్చింది బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హా. లింగా ప్రమోషన్‌లో స్వీటీని తనివితీరా ముద్దాడినంత పని చేసింది. అయితే కేవలం సోనాక్షి మాత్రమే కాదు.. తనతో పరిచయం అయిన ఎవరైనా ముద్దాడాలన్నంత ముచ్చటపడిపోతారు. అంత మంచి మనసు ఉన్న నాయిక కాబట్టే ఇంతకాలం మన దర్శకనిర్మాతలు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.

అంతేకాదు స్వీటీవల్ల నిర్మాతలకు బోలెడంత ప్రత్యక్ష లాభం ఉంది. సందర్భాన్ని బట్టి, ఎదుటివారి అవసరాన్ని బట్టి పనులు పూర్తి చేసే చాణక్యం అనుష్కకు ఉందని మేకర్స్‌ చెబుతుంటారు. లేటెస్టుగా స్వీటీ ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో సైజ్‌ జీరో అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తవుతోంది. అంటే దీనర్థం స్వీటీ అందిస్తున్న సహకారం వల్లే. ఫిలింసిటిలో షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇంత వేగంగా చిత్రీకరణ పూర్తయిందంటే నాయికగా స్వీటీ స్పీడ్‌ కాబట్టే సాధ్యమైందని యూనిట్‌ చెబుతోంది.

ఈ సినిమాని సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి ఇప్పట్నుంచి టాలీవుడ్‌లో బాహుబలి ప్రమోషన్‌లో స్వీటీ పాల్గొనడానికి రెడీ అవుతోందని చెబుతున్నారు. కమిట్‌మెంట్‌ అంటే ఎలా ఉండాలో స్వీటీని చూసి మిగతా నాయికలు తెలుసుకోవాలి. సైజ్‌ జీరోలో కామియోలు చేస్తున్న సోనల్‌, శ్రుతి కూడా.