Begin typing your search above and press return to search.

కష్టపడి పెంచితే.. కవరింగ్ అంటారా?

By:  Tupaki Desk   |   7 Sept 2015 3:06 PM IST
కష్టపడి పెంచితే.. కవరింగ్ అంటారా?
X
సైజ్ జీరో సినిమా మొదలైనప్పటి నుంచి అనుష్కను చూస్తూనే ఉన్నాం. కొంచెం బరువైతే పెరిగిన మాట వాస్తవమే కానీ.. మరీ ‘సైజ్ జీరో’లో కనిపించినంతగా ఎప్పుడు బరువెక్కిందా అన్నది అందరి డౌటు. మరీ ఆ స్థాయిలో ఎప్పుడూ బయట దర్శనమివ్వలేదు అనుష్క. అంత బరువెక్కడం.. మళ్లీ తగ్గీ మామూలవడమంటే కొన్ని రోజుల్లో రోజుల్లో ముగిసిపోయే వ్యవహారం కాదు. ఇటు, అటు చాలా గ్యాప్ ఉండాలి. అందుకే ‘సైజ్ జీరో’ విషయంలో అనుష్క కొంత వరకు మేకప్ తో కవర్ చేసిందని జనాలు అనుకుంటున్నారు. ఐతే మామూలు మేకప్ అయితే ఈజీగా కనిపెట్టేస్తారని.. ప్రోస్థెటిక్ మేకప్ ట్రై చేసిందని.. అందుకే అంత సహజంగా కనిపించిందని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. ఐతే అనుష్క ఈ వ్యాఖ్యలతో బాగా హర్టయిపోయింది. తాను అంత కష్టపడి బాడీ పెంచితే.. ఇంత తేలిగ్గా కొట్టి పారేస్తారా అని ప్రశ్నిస్తోందామె.

‘సైజ్ జీరో’ విషయంలో అసలెక్కడా మేకప్పే వాడలేదని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది అనుష్క. సహజంగానే బరువు పెరిగానని.. సినిమాలో కనిపించబోయేది తన ఒరిజినల్ అవతారమని అంటోంది అనుష్క. రెండు నెలల పాటు స్పెషల్ డైట్ తీసుకుని బరువు పెరిగానని.. ముఖంలోనూ ఫ్యాట్ గా కనిపించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించానని.. సైజ్ జీరో తన పాత్ర వంద శాతం ఒరిజినల్ అని నొక్కి వక్కాణించింది అనుష్క. తన యోగా నైపుణ్యం మీద ఉన్న నమ్మకంతో బరువు పెరిగే విషయంలో ఎక్కడా కంగారు పడలేదని.. మళ్లీ సాధారణ స్థితికి చేరగలనన్న పూర్తి నమ్మకంతోనే రిస్క్ చేశానని అనుష్క వెల్లడించింది. బరువైన పాత్ర కోసం షూటింగ్ పూర్తవగానే బరువు తగ్గడం మొదులపెట్టానని.. ఇప్పటికే చాలా వరకు ఫలితం కనిపించిందని.. త్వరలోనే ఒకప్పటిలా తయారవుతానని.. బాహుబలి-2 షూటింగులో పాల్గొంటానని అనుష్క చెప్పింది.