Begin typing your search above and press return to search.

ఆలోగా ప్రేమ పుట్టొచ్చు- అనుష్క

By:  Tupaki Desk   |   29 Jun 2015 12:38 PM IST
ఆలోగా ప్రేమ పుట్టొచ్చు- అనుష్క
X
అనుష్క పెళ్లి గురించి ఆరేడేళ్లుగా చర్చ జరుగుతోంది. ఓసారి ప్రేమలో పడిందంటారు. ఇంకోసారి పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంటుందంటారు. అందులోనూ ఈ మధ్య అయితే పెళ్లి వార్తలు మరీ ఎక్కువైపోయాయి. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్న ప్రచారం జరిగింది. ఐతే అనుష్క మాత్రం ఈ వార్తల గురించి పట్టించుకోకుండా చక్కగా సినిమాలు చేసుకుపోతోంది. 33 ఏళ్ల వయసులోనూ ఆమె జోరు మామూలుగా లేదు.

ఐతే వయసు మీద పడిపోతోంది కదా.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అనుష్కను అడిగితే.. ''నా నట జీవితం దశాబ్దం పూర్తి చేసుకుంది. ఒక్కసారి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న మాట వాస్తవమే. నా జీవితంలో తర్వాతి ముఖ్య ఘట్టం పెళ్లే అనడంలో సందేహం లేదు. ఏ అమ్మాయికైనా పెళ్లి చాలా ముఖ్యమైన విషయం అని తెలుసు. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచించే టైం నాకు లేదు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి పూర్తయ్యేలోపు నాలో ప్రేమ పుట్టవచ్చు. లేదా తల్లిదండ్రులే మంచి వరుణ్ని చూడవచ్చు. ఏ విషయాన్నయినా ఆ సమయం వచ్చినపుడు బహిరంగంగా చెబుతాను. అంతవరకు నా ప్రేమ, పెళ్లి గురించి ఎవరేం చెప్పినా నమ్మవద్దు'' అని అభిమానులకు పిలుపునిచ్చింది జేజెమ్మ.