Begin typing your search above and press return to search.

స్పీడ్ క్యాచ్ చేయలేరంటున్నఅనుష్క

By:  Tupaki Desk   |   26 March 2016 1:00 PM IST
స్పీడ్ క్యాచ్ చేయలేరంటున్నఅనుష్క
X
బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మకు అందం - అభినయం మాత్రమే కాదు.. ధైర్యం కూడా ఎక్కువే. ఈ విషయం ఆమెతో సినిమాలు చేసిన వారికి మాత్రమే అర్ధమవుతుంది. హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉంటూనే.. ఎన్ హెచ్ 10 అనే మూవీతో నిర్మాతగా మారిపోయిందంటే.. అమ్మడి ధైర్యం అర్ధమవుతుంది. ఇప్పుడు సుల్తాన్ మూవీలో రెజ్లింగ్ ప్లేయర్ గా కనిపించేందుకు ఫిజికల్ ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతోంది నూషీ.

అన్నట్లు అనుష్క శర్మకు రెండు ముద్దు పేర్లు ఉన్నాయి. అను - నూషీ అనే పెట్ నేమ్స్ తో ఈ భామను దగ్గరి వాళ్లు పిలుస్తూ ఉంటారు. సినిమాల్లో నటించడమే కాకుండా.. నిర్మాణం బాగా ఇష్టమని అంటోంది అను. హై హీల్స్ అంటే బాగా భయం అంటున్న ఈబాలీవుడ్ బ్యూటీ.. తప్పనిసరి అయితే తప్ప వాటిని వేసుకోనని చెప్పింది. అంతే కాదు.. డబ్బును ఏ మాత్రం లెక్క చేయనని.. డబ్బుతో లింక్ చేస్తే.. లైఫ్ అంతా యాంత్రికంగా కనిపిస్తుందని అంటోంది అనుష్క శర్మ.

డబ్బు లేని లైఫ్ లో ప్యూరిటీ ఉంటుందన్నది అనుష్క శర్మ విశ్వాసం. అయితే.. తను ఎక్కవుగా 'నే చెప్పేది అర్ధమవుతోందా' అనే వాక్యాన్ని వాడాల్సి వస్తుందట. దీనికి కారణం.. చాలా స్పీడ్ గా మాట్లేడేస్తుండడంతో.. చాలామంది వీటిని క్యాచ్ చేయలేకపోతూ ఉంటారట. అందుకే వాళ్లకు అర్ధమైందో లేదో తనకు అర్ధంకాక.. 'నేను చెప్పింది అర్ధమవుతోందా' అనే ప్రశ్న వేయాల్సి వస్తుందట. మొత్తంమీద తన స్పీడ్ క్యాచ్ చేయడం మాత్రం అందరి వల్లా కాదని తేల్చేసింది అనుష్క శర్మ.