Begin typing your search above and press return to search.
ఫ్రెండ్సుకి పెళ్లిళ్లయిపోయాయ్, నాకే కాలేదు
By: Tupaki Desk | 30 Dec 2015 3:00 PM ISTపెళ్లి బెంగ పట్టుకున్నట్టుంది స్వీటీకి. ఓ వైపు కెరీర్ పీక్స్ లో ఉంది. బాహుబలి - రుద్రమదేవి - సైజ్ జీరో లాంటి సినిమాలతో ఏడాదంతా బిజీ నాయికగా గడిపేసింది. ఇప్పుడు బాహుబలి -2 కోసం రెడీ అవుతోంది. 2016 తన కెరీర్‌లోనే మెమరబుల్ ఈయర్ గా మారబోతోంది. 2015లో దేవసేన - రుద్రమదేవి క్యారెక్టర్లు తనకి బోలెడంత గుర్తింపు తెచ్చాయి. సినిమా ఫ్లాపైనా సైజ్ జీరోలో స్వీటీ రోల్ కూడా చక్కని గుర్తింపు తెచ్చింది. అందుకే ఈ ఉత్సాహంలో చాలా సంగతుల్ని గుర్తు చేసుకుంది అమ్మడు.
దశాబ్ధం కెరీర్ లో ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా. నాగార్జున వల్లనే నాలో పరిణతి వచ్చింది. ఆయన వల్లనే పరిశ్రమలో అడుగుపెట్టా. కథానాయికగా ఎదిగాను.. అని వినమ్రంగా చెబుతూనే .. మూడు పదుల వయసులో పెళ్లి గోల గురించి కూడా మనసు విప్పి మాట్లాడింది. అవును.. నా ఈడు అమ్మాయిలందరికీ పెళ్లిల్లయిపోతున్నాయ్. నా స్నేహితురాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిలైపోయారు. నేను మాత్రమే ఖాళీగా ఉండిపోయా. అయితే ఇలా ఉండాలని అనుకోలేదు. పిల్లా పాపల్ని కని, భర్తతో కాపురం చేయాలనుందన్న కోరికను బైటపెట్టింది. అయితే ఇంత అందంగా ఉన్నావ్? ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తే .. యోగా వల్లనే ఇది సాధ్యమైంది. .. అని చెప్పింది.
అసలింతకీ పిల్లాడిని వెతుక్కుంటున్నావా? అని ప్రశ్నించినా దానికి సమాధానం అయితే లేదు. మరి 2016లో అయినా తనకి పెళ్లవుతుందంటారా? ఓ వైపు బాహుబలుడు ప్రభాస్‌కి పెళ్లయిపోయే ఛాన్సుందని కథనాలు వస్తున్నాయ్. ఇదే అదనుగా తను కూడా ఓ పిల్లాడిని వెతుక్కుంటుందా చూడాలి మరి!