Begin typing your search above and press return to search.

మరోసారి భారీ రేటు పలికిన 'నిశబ్దం'

By:  Tupaki Desk   |   7 Nov 2020 11:32 AM IST
మరోసారి భారీ రేటు పలికిన నిశబ్దం
X
ఏడాది కాలం పాటు ఊరించిన అనుష్క నిశబ్దం సినిమా ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త ఎక్కువ ప్రచారం చేశారు. కాని సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. ఇదేం సినిమారా బాబోయ్‌ ఇంకా నయం ఈ సినిమా థియేటర్లలో విడుదల అవ్వలేదు అంటూ నెటిజన్స్‌ విపరీతమైన ట్రోల్స్‌ చేశారు. అనుష్క మూగ చెవిటి అమ్మాయిగా నటించిన ఈ సినిమాలో మాధవన్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. అంజలి మరియు షాలిని పాండే కూడా నటించిన ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో అమెజాన్‌ వారు భారీ మొత్తంకు కొనుగోలు చేశారు.

సినిమా ఫలితం తెలియక అమెజాన్‌ భారీ రేటుకు కొనుగోలు చేసింది ఓకే కాని తాజాగా సినిమా ఫలితం తెలిసిన తర్వాత కూడా జీ తెలుగు వారు భారీ మొత్తానికి శాటిలైట్‌ రైట్స్ ను కొనుగోలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఓటీటీలో సత్తా చాటని ఈ సినిమా శాటిలైట్‌ ద్వారా ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులు ఆధరిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జీ తెలుగు వారు ఈ సినిమాను కాస్త ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారట. త్వరలోనే ఈ సినిమా వరల్డ్‌ ప్రీమియర్‌ కు జీ తెలుగు రెడీ అవుతుంది. దీపావళికి లేదా వచ్చ నెలలో మంచి అకేషన్‌ ను చూసి జీ తెలుగు 'నిశబ్దం' సినిమాను టెలికాస్ట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.