Begin typing your search above and press return to search.

పవన్ కోసం స్వీటీని లాక్ చేసిన డైరెక్టర్

By:  Tupaki Desk   |   5 May 2020 12:45 PM IST
పవన్ కోసం స్వీటీని లాక్ చేసిన డైరెక్టర్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' తో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో ఈ రెండు సినిమాల షూట్ కూడా ఆగిపోయింది. ఇదిలా ఉంటే క్రిష్ - పవన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కథ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అనుష్కను తీసుకున్నారట. క్రిష్ ఈమధ్యే అనుష్కను సంప్రదించారని.. వీడియో కాల్ ద్వారా కథ వినిపించారని.. అనుష్కకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అనుష్క ఈమధ్య చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. పాత్ర ఎంతో నచ్చితే కానీ సినిమాలు సైన్ చెయ్యడం లేదు. ఈలెక్కన చూస్తే క్రిష్ హీరోయిన్ పాత్రను అద్భుతంగా డిజైన్ చేసి ఉంటాడని అనుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక రాజు కుటుంబానికి చెందిన యువతి పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను తీసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది నిజామా కదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

క్రిష్ - ప‌వన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా పీరియడ్ కథాంశం కావడంతో పవన్ ను కొత్తగా చూపిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ భారీ బడ్జెట్ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.