Begin typing your search above and press return to search.

భాగమతికి విసుగొచ్చింది

By:  Tupaki Desk   |   24 Jan 2018 4:07 PM IST
భాగమతికి విసుగొచ్చింది
X
అవును. నిజంగానే భాగమతికి విసుగొచ్చింది. కాని సినిమా గురించి కాదు లెండి. స్వీటీ అనుష్కను మీడియా గత కొద్ది రోజులుగా ప్రభాస్ తో తనకున్న అనుబంధం గురించి పదే పదే అడగటం పట్ల చిరాకు పుట్టిన అనుష్క రెండు మూడు ఇంటర్వ్యూలు ఈ కారణంగానే తప్పుకుంది అనే టాక్ బయటికి వచ్చింది. తను ప్రభాస్ పలుమార్లు దీని గురించి క్లారిటీ ఇచ్చినా ప్రతి యాంకర్ ఆ ప్రశ్న మొదటిసారి అడుగుతున్నట్టు ఫీల్ అవుతూ ఇరిటేట్ చేస్తుండటంతో ఇక దేనికి ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఉత్తమం అని నిర్ణయం తీసుకుందట. ఎల్లుండి విడుదల కానున్న భాగమతి ప్రమోషన్ వేగం పెంచింది యువి సంస్థ. తెలుగు వెర్షన్ వరకు అనుష్క తప్ప ఇంకే సెల్లింగ్ ఫ్యాక్టర్ ఇందులో లేదు. అందుకే వీలైనంత ఎక్కువ తననే మైక్ ముందుకు పంపిస్తున్నారు.

ఇప్పటికే తమిళ్ - మళయాళ - తెలుగు వెర్షన్స్ కోసం అటు ఇటు తిరుగుతూ బాగా కష్టపడుతున్న అనుష్కతో పాటు ఫాన్స్ కు కూడా దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. బంగాళాకు సంబంధించి, ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి రోజుకో విశేషం బయటికి వస్తుండటంతో హైప్ పెరుగుతూ పోతోంది. ఇవాళ విడుదల చేసిన భాగమతి థీమ్ సాంగ్ తో ఉన్న ప్రమోషనల్ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఆన్ సెట్స్ వీడియోస్ తో పాటు సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో చూచాయగా ఇందులో చూపించేసారు.

మరో ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రమోషనల్ వీడియో లో ప్రభాస్ కూడా ఉండటం. ఒక చోట షూటింగ్ బ్రేక్ లో యూనిట్ సభ్యులతో పాటు మొహానికి కర్చీఫ్ కట్టుకున్న ప్రభాస్ కనిపించాడు. మొహం కనిపించకపోయినా అది ముమ్మాటికి ప్రభాస్ అంటున్నారు ఫాన్స్. యువి సంస్థతో తనకు అనుబంధం ఉండటం - సాహో నిర్మాణమవుతోంది కూడా అదే బ్యానర్ లో కాబట్టి ఫ్రెండ్లీ విజిట్ తప్ప ఇందులో క్యామియో చేయటం లాంటివి ఏమి ఉండవు అని తెలుస్తోంది. ఎంత కావాల్సిన సంస్థ అయినా ప్రత్యేకంగా చూడడానికి వచ్చాడు అంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది అనే దానికి సమాధానం ఒక్క డార్లింగ్ కే తెలుసు.