Begin typing your search above and press return to search.

అనుష్క సై..రా అంటోందా?

By:  Tupaki Desk   |   28 Aug 2017 5:45 AM GMT
అనుష్క సై..రా అంటోందా?
X
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాపై అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సై..రా.. నరసింహారెడ్డి అనే టైటిల్ పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ లో నటించనున్నారు చిరు. టైటిల్ తో పాటు లోగో లుక్ అనౌన్స్ చేసిన రోజునే.. మూవీ యాక్టర్స్.. టెక్నికల్ టీంతో ఓ చిన్నపాటి టీజర్ ను కూడా లాంఛ్ చేశారు. అందులో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు కూడా.

అయితే.. ఇప్పుడీ సై..రా.. చిత్రంలో అనుష్క కూడా నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కు ముగ్గురు హీరోయిన్స్ అవసరం అనే మాట ముందు నుంచి వినిపిస్తోంది. ఇద్దరు భార్యలతో పాటు.. ఆయన జీవితం పంచుకున్న మరో మహిళ రోల్ కూడా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. అందుకోసమే ముగ్గురు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేస్తున్నారని.. ఒక రోల్ కు నయనతారను అనౌన్స్ చేయగా.. మరో పాత్ర కోసం అనుష్కను సంప్రదించగా.. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. మూడో హీరోయిన్ పాత్రకు ఇంకా ఎంపిక జరుగుతోండగా.. బాలీవుడ్ హీరోయిన్ ను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం అనుష్క చేతిలో భాగమతి మినహాయిస్తే.. మరో ప్రాజెక్ట్ ఏదీ లేదు. భాగమతి కి అనుష్క షూటింగ్ పార్ట్ పూర్తయిపోయింది కూడా. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మాత్రమే జరుగుతోంది. అంటే అనుష్క చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవనే చెప్పాలి. పైగా బాహుబలి మూవీలో దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. సై..రా చిత్రంలో భాగం అయితే.. నేషనల్ ప్రాజెక్ట్ గా రిలీజ్ చేసే విషయంలో ఈ చిత్ర యూనిట్ మరో అడుగు వేసినట్లే అనే టాక్ వినిపిస్తోంది.