Begin typing your search above and press return to search.

బొద్దుగుమ్మల మనోభావాలు దెబ్బతీసింది

By:  Tupaki Desk   |   1 Sep 2015 10:15 AM GMT
బొద్దుగుమ్మల మనోభావాలు దెబ్బతీసింది
X
స్వీటీ అనుష్క రొటీన్‌ కి డిఫరెంట్‌ గా వెళుతోంది. ఏవో గ్లామర్‌ డాళ్‌ క్యారెక్టర్ లకు ఓకే చెప్పేయకుండా తనవైపు వచ్చిన స్క్రిప్టుల నుంచి తెలివైన ఎంపికలు చేసుకుని తెరపై తానే హీరోగా వెలిగిపోతోంది. అప్పట్లో అరుంధతి, ఆ తర్వాత బాహుబలి లేటెస్టుగా రుద్రమదేవి ఈ తరహా ఎంపికలే. రుద్రమదేవి 3డిలో వీరనారి రాణీ రుద్రమ పాత్రలో నటించింది. ఇప్పుడు వీటన్నిటికీ కాంట్రాస్టుగా వేరొక క్యారెక్టర్‌ ని ఎంపిక చేసుకుని అమ్మాయిల గుండెల్లో నిద్రపోతోంది.

ఒక బొద్దమ్మాయ్‌ రోజువారీ వ్యవహారికాన్ని తెరపై పండించబోతోంది స్వీటీ. అందుకోసం లావుపాటి రూపంతో అభినయించింది. ఈ చిత్రంలో స్వీటీ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపిస్తోంది. లేటెస్టుగా టీజర్‌ రిలీజైంది. ఇందులో బొద్దమ్మాయ్‌ పడే పాట్లు ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్‌ గా చేసి చూపించింది. ఈ వీడియోని చూసిన తర్వాత ఏపీ, తెలంగాణ, తమిళనాడులో ఉన్న బొద్దమ్మాయ్‌ లంతా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ స్వీటీమీద పడితే ఎలా ఉంటుంది? బుల్డోజర్‌ వెళ్లి బస్సుని గుద్దినట్టు ఉండదూ?

అసలే ఇది మనోభావాలు దెబ్బ తినే కాలం. మతాల్ని - ప్రాంతాల్ని - భాషల్ని - అభిరుచుల్ని - రూపాల్ని - చివరికి దేవుళ్లని కించపరిచేలా వ్యవహరిస్తే కొట్టేస్తున్నారు. ఇప్పుడు బొద్దుగుమ్మల జీవితాల్ని తెరపైకి తెచ్చినందుకు ఇటు ప్రకాష్‌ కి, అటు అనుష్క కి థ్రెట్‌ తప్పదేమో?