Begin typing your search above and press return to search.

మై లవ్ అంటున్న టాలీవుడ్ స్వీటీ

By:  Tupaki Desk   |   6 Oct 2018 2:51 PM IST
మై  లవ్ అంటున్న టాలీవుడ్ స్వీటీ
X
ఫ్యాన్స్ అందరూ స్వీటీ అని పిలుచుకునే అనుష్క ఈ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. 'భాగమతి' తర్వాత ఇంతవరకూ తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు. హీరో మాధవన్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి గానీ ఇంకా ఆ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. మరో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఒక యువదర్శకుడికి పచ్చజెండా ఊపిందని కూడా గుసగుసలు వినిపించాయి.

రీసెంట్ గా అనుష్క తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసి 'మై లవ్' అనే క్యాప్షన్ ఇచ్చింది. అనుష్క పెట్ డాగ్ ఏమోగానీ దాన్ని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంది. నెటిజనులకు ఈ పిక్ సూపర్ గా నచ్చిందండోయ్.. 24 నాలుగుగంటల లోపే 1.37 లక్షల లైకులు వచ్చాయి. అందరూ సూపర్ కామెంట్లు పెట్టారు గానీ ఒకడు మాత్రం "మీకు పెళ్లి..పెళ్ళాం.. పైసలు.. ఇలా ఎలాంటి సమస్య ఉన్నా నన్ను సంప్రదించండి..వేదిక్ పరిష్కారం చూపిస్తా" అని తన బిజినెస్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. ఎవడి గోల వాడిది.

ఇలాంటి బఫూన్ గాళ్ళు ఎక్కడైనా ఉంటారు కాబట్టి మనమే కాదు అనుష్క లాంటి వాళ్ళు కూడా తప్పించుకోలేరు. ఇక అనుష్క ఆస్ట్రియాలో ఒక డీటాక్స్ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ చేసుకుందని త్వరలో స్లిమ్ అవతారంలో మారి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోందట. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేస్తుందని సమాచారం.