Begin typing your search above and press return to search.

సెమీ న్యూడ్‌ క్యారెక్టర్‌ లో అనుష్క?

By:  Tupaki Desk   |   22 Nov 2015 11:54 AM IST
సెమీ న్యూడ్‌ క్యారెక్టర్‌ లో అనుష్క?
X
ఆర్య - విశాల్‌ - అరవిందస్వామి - అధర్వ - రానా... ఇంతమంది స్టార్లతో భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నారు బాలా. జాతీయ అవార్డ్‌ గ్రహీతగా బాలా వర్కింగ్‌ స్టయిల్‌ వెరీ స్పెషల్‌. విలక్షణమైన కథల్ని ఎంపిక చేసుకుని, వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్ లతో స్పెషల్‌ మూవీస్‌ తీసే దర్శకుడిగా ఆయనకంటే ఓ ఐడెంటిటీ ఉంది. రామెటీరియలిస్టిక్‌ కంటెంట్‌ తో ఇప్పటివరకూ హీరోల్ని - హీరోయిన్లని డీగ్లామరస్‌ రోల్స్‌ లో చూపించి అరుదైన ఫీట్స్‌ వేసిన దర్శకుడిగా అతడిలోని విలక్షణతను సౌత్‌ ఆడియెన్‌ గుర్తించారు. ఇప్పుడు మరోసారి భారీ మల్టీస్టారర్‌ తో ఆసాధారణ ఫీట్‌ వస్తున్నాడు బాలా.

మరోసారి ఆయన కాంట్రవర్శియల్‌ సబ్జెక్టునే ఎంచుకుని ముందుకొచ్చాడు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని ఘట్టాలతో - కుట్ర పరంబారి అనే వివాదాస్పద అంశంతో ఈ సినిమాని తీస్తున్నాడు. ఈ మూవీలో ఓ కథానాయికగా అనుష్కను ఎంపిక చేసుకున్నాడన్నది ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌. స్వీటీ అనుష్క ను కలిసి బాలా తన క్యారెక్టరైజేషన్‌ గురించి ముచ్చటించాడు. కాస్త సెమీన్యూడ్‌ క్యారెక్టర్‌ ఇది గ్లామరస్‌ గా కనిపించాల్సి ఉంటుందని కూడా చెప్పాడు. అయితే బాలా అంతటి క్రియేటర్‌ తనని ఈ క్యారెక్టర్‌ కోసం అడగడంతో అనుష్క సైతం ఎంతో ఎగ్జయిట్‌ అయ్యి ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం బాహుబలి చిత్రం కోసం రెడీ అవుతోంది. ఈలోగానే ఇదో ఎగ్జయిటింగ్‌ ఆఫర్‌. మరి రెండు సినిమాల కోసం కాల్షీట్లను ఎలా సర్ధుబాటు చేస్తుందో చూడాల్సి ఉందింకా.