Begin typing your search above and press return to search.

3 AM సీక్రెట్ ఫ్రెండ్ అనుకుంటే పొర‌పాటే!

By:  Tupaki Desk   |   15 March 2020 2:30 PM GMT
3 AM సీక్రెట్ ఫ్రెండ్ అనుకుంటే పొర‌పాటే!
X
స్నేహాలు ఎన్ని ర‌కాలు? అన్న‌ది ప‌రిశీలిస్తే .. అందులో ర‌క‌ర‌కాల డివిజ‌న్స్ ఉంటాయి. క‌ష్టం న‌ష్టం క‌లిగిన‌ప్పుడు త‌న‌కు తానుగా వ‌చ్చి ఆదుకునే స్నేహితుడే సిస‌లైన స్నేహితుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆప‌ద‌లో ఆదుకోని వాడు ఫ్రెండు ఎలా అవుతాడు? అవ‌స‌రానికి ఉప‌యోగ‌ప‌డేవాడు ఫ్రెండు ఎలా అవుతాడు? మిడ్ నైట్ లో అవ‌స‌రం వ‌చ్చినా నిదుర పోగొట్టుకుని ఆదుకునే స్నేహితులు ఎంద‌రికి ఉంటారు? అలా అరుదుగానే సాధ్యం. అయితే ఇలాంటి ఒక‌ స్నేహితునికి సంబంధించిన గుట్టు విప్పింది స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి. అస‌లు డార్లింగ్ ప్ర‌భాస్ తో స్వీటీ స్నేహం ఎలాంటిది? అన్న‌దానికి త‌ను ఇచ్చిన ఆన్స‌ర్ ఆస‌క్తిని రేకెత్తించింది.

ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్.. ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్! అన్న తీరుగా క‌ష్టంలో త‌న‌ని ఆదుకునే స్నేహితుడు అని అనుష్క ఇదివ‌ర‌కూ చాలా సంద‌ర్భాల్లో తెలిపింది. ప్ర‌భాస్ తో ఎఫైర్ .. పెళ్లి అంటూ ర‌క‌ర‌కాల గాసిప్పులు వ‌చ్చిన‌ప్పుడు వాటికి ఎంతో బాధ‌ప‌డుతూ.. కేవ‌లం స్నేహితులం మాత్ర‌మేనని .. 15 ఏళ్లుగా ఈ స్నేహం కొన‌సాగుతోంద‌ని వెల్ల‌డించింది. ఇక 3ఏఎం ఫ్రెండ్! అంటూ కాస్త ఆంగ్ల ప‌రిజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించినా మ‌రీ తెల్ల‌వారు ఝామున క‌లిసే ఫ్రెండా? అని అడ‌గాల్సిన ప‌నే లేదు. దాన‌ర్థం త‌న‌ని అర్థం చేసుకుని త‌న క‌ష్టాల్ని తెలుసుకుని స‌హాయ‌ప‌డే స్నేహితుడు అన్న‌ది స్వీటీ మీనింగ్ అన్న‌మాట‌. ఇక ప్ర‌భాస్ ఆఫ్ ద స్క్రీన్ ఎంతో సిగ్గ‌రి అని .. ఎంతో ఎమోష‌న‌ల్ గా ఉంటాడ‌ని కూడా స్వీటీ ఎవ‌రికీ తెలియ‌ని త‌న‌కు మాత్ర‌మే తెలిసిన‌ అస‌లు ర‌హ‌స్యం రివీల్ చేసింది.

అనుష్క మాట‌ల్ని బ‌ట్టి ప్ర‌భాస్ ని ఇంత బాగా అర్థం చేసుకున్న వేరొక‌రు ఉండ‌రేమో అనిపించ‌క మాన‌దు. ఇక ప‌రిశ్ర‌మ‌లో రానా - రాజ‌మౌళి- ప్ర‌శాంతి- నాని- సుప్రియ వీళ్లంతా త‌న‌కు క్లోజ్ ఫ్రెండ్స్. వీరంద‌రితోనూ క‌లిసి షికార్లు చేయ‌డం అన్నా ఇష్ట‌మేన‌ని వెల్ల‌డించింది. నిశ్శ‌బ్ధం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఇలాంటి ఎన్నో ర‌హ‌స్యాల్ని తాజాగా స్వీటీ ఓపెన్ చేస్తోంది.