Begin typing your search above and press return to search.
భాగమతికి రజనీకాంత్ ఫోన్ చేసి...
By: Tupaki Desk | 3 Feb 2018 10:04 AM ISTప్రస్తుత జనరేషన్ లో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కచ్చితంగా అనుష్కయే. ఒక రకంగా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా పేరుతెచ్చుకుంది. రీసెంట్ గా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి సినిమాకు టాప్ 10 అట్రాక్షన్స్ లో ఒకటి నుంచి పది వరకు అనుష్క అనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అయి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అనుష్కకు తిరుగులేదని చాటింది.
భాగమతి సినిమాలో అనుష్క నటనకు మంచి గుర్తింపే వచ్చింది. విమర్శకులు సైతం ఆమె నటనను ప్రశంసించారు. ఈ సినిమాకు ఎప్పటికీ మరిచిపోలేది.. మహా ఆనందం కలిగించిన ప్రశంస కూడా ఉందిట. అది సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి లభించిందని చెప్పుకొచ్చింది అనుష్క. రీసెంట్ గా రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి భాగమతి సినిమాలో అనుష్క నటనను మెచ్చుకున్నారు. ఈ విషయం స్వయంగా అనుష్కయే ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రజనీకాంత్ నుంచి సర్ ప్రైజ్ కాల్ రావడమే కాకుండా నటన బాగుందచి చెప్పడం చాలా థ్రిల్ కు గురిచేసిందని తెలిపింది.
యువీ క్రియేషన్స్ బ్యానర్ పై పిల్ల జమిందార్ ఫేం అశోక్ డైరెక్షన్ లో వచ్చిన భాగమతి సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి బయ్యర్లకు లాభాలు పంచింది. తెలుగులో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ బాగున్నా తమిళంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. సూపర్ స్టార్ బాగుందని చెప్పడం ఏమన్నా ప్లస్సవుతుందేమో...
