Begin typing your search above and press return to search.

అనుష్క ఇక లాభం లేదని ఏం చేస్తోందంటే..

By:  Tupaki Desk   |   29 Jun 2016 5:00 PM IST
అనుష్క ఇక లాభం లేదని ఏం చేస్తోందంటే..
X
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అని ఓ సామెత ఉంటుంది. అనుష్క పరిస్థితి ఇలాగే ఉంది మరి. ఏదో కళాఖండంలో నటించేస్తున్న ఫీలింగుతో ‘సైజ్ జీరో’ కోసం చాలా పెద్ద సాహసమే చేసింది జేజెమ్మ. ఇండియాలో ఏ హీరోయినూ చేయని విధంగా ఈ సినిమా కోసం ఏకంగా 20 కిలోలకు పైగా బరువు పెరిగింది. తీరా చూస్తే సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం లేకపోయింది. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కొన్ని నెలలుగా అనుష్క పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్వయంగా యోగా టీచర్ అయినా సరే.. అనుష్క అనుకున్న ప్రకారం బరువు తగ్గలేకపోయింది. దీంతో విలువైన ఆమె డేట్స్ వేస్టయిపోయాయి.

ఇప్పుడు బాహుబలి లాంటి మెగా ప్రాజెక్టు మీద కూడా ఈ ప్రభావం పడేలా ఉండటంతో బరువు తగ్గడానికి కొత్త మార్గం ఎంచుకుందట అనుష్క. కేవలం ఎక్సర్ సైజులతో సరిపెట్టకుండా.. బరువు తగ్గడం కోసం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటోందట. ఐతే లైపోసక్షన్ లాంటివేమీ చేసుకోవట్లేదామె. నిపుణులైన వైద్యుల సలహా ప్రకారం డైట్ తీసుకుంటూ.. వ్యాయామం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేస్తోందట. ఆ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని.. ఇంకొన్ని రోజుల్లోనే అనుష్క మామూలుగా మారిపోతుందని అంటున్నారు. అనుష్క కోసమని.. బాహుబలి.. భాగమతి.. సింగం-3తో పాటు అజిత్ కొత్త సినిమా యూనిట్ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇంకో నెలన్నర తర్వాత అనుష్క ‘బాహుబలి: ది కంక్లూజన్’ షూటింగ్‌ లో పాల్గొనే అవకాశముంది.