Begin typing your search above and press return to search.

స్వీటీని ఫ్యాన్స్ మ‌ర్చిపోయారా?

By:  Tupaki Desk   |   25 Aug 2018 4:27 AM GMT
స్వీటీని ఫ్యాన్స్ మ‌ర్చిపోయారా?
X
బాహుబ‌లి 2 - భాగ‌మ‌తి సినిమాల త‌ర్వాత అనుష్క శెట్టి ఫిల్మోగ్ర‌ఫీ వీకైపోయింది. వీకీలో వెతికితే ఒక్క కొత్త సినిమా పేరు కూడా అక్క‌డ క‌నిపించ‌లేదు. 13 ఏళ్ల కెరీర్ ధేధీప్య‌మానంగా సాగించిన స్వీటీకి మొన్న‌టి బ‌ర్త్‌ డే వేళ‌ అభిమానులంతా సంబ‌రంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇంత‌టి అజేయ‌మైన కెరీర్ ఉంది. ఇప్ప‌టికీ అభిమానులు ఆరాధిస్తూనే ఉన్నారు. అలాంట‌ప్పుడు ఇప్పుడే సడెన్‌ గా ఎందుకీ ఖాళీ? అస‌లు స్వీటీ విష‌యంలో ఏం జ‌రుగుతోంది? తదుప‌రి ప్రాజెక్టును ఎందుకు క‌న్ఫామ్ చేయ‌డం లేదు. వేన‌వేల ప్ర‌శ్న‌లెన్నో.

ఇలా అయితే అభిమానులు కూడా మునుముందు లైట్ తీస్కుంటారేమో! ఓ వైపు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారని, తొంద‌ర్లోనే స్వీటీ పెళ్లి క‌బురు అందే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకుంటున్నారు. అయితే దేనినీ స్వీటీ కానీ, స్వీటీ త‌ర‌పు బంధువులు కానీ క‌న్ఫామ్ చేయ‌డం లేదు. దీనిపై అభిమానుల్లో ఓకింత కంగారు క‌నిపిస్తోంది. స్వీటీ ఏదో ఒక మంచి మాట చెబుతుంద‌ని, త‌దుప‌రి సినిమాని ప్ర‌క‌టిస్తుంద‌ని వేచి చూస్తున్నారు. అప్ప‌ట్లో స్వీటీ త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకుని పీఆర్ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అందులో నిజం లేదా? ఎలాంటి ప్ర‌క‌ట‌నా.. ఇంత‌కీ రాదే.. ఎంత‌కీ రాదే! అని ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు?

అందుకేనేమో! స్వీటీ త‌ర‌పున అభిమానులే ఓ అరుదైన ఫోటోని షేర్ చేశారు మొన్న‌టి మెగాబ‌ర్త్ డే వేళ‌. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వంటి లెజెండ్ ఉన్నారు. శ‌త్రుఘ్న సిన్హా - టీఎస్సార్‌ - మంచు మోహ‌న్‌ బాబు వంటి ప్ర‌ముఖులు ఉన్నారు. అరుదైన ఫోటోనే ఇది.. స్వీటీ జ్ఞాపకాల్లో దాచుకున్న రేర్ క‌లెక్ష‌న్‌. అస‌లింత‌కీ గౌత‌మ్ మీన‌న్‌ తో సినిమా ఏమైంది? మ‌ళ్లీ అనుష్క నుంచి ప్ర‌క‌ట‌న వ‌స్తుందేమో చూడాలి.