Begin typing your search above and press return to search.

యునిట్ కోసం అనుష్క స్పెషల్ డ్యాన్స్

By:  Tupaki Desk   |   6 Sept 2016 5:03 PM IST
యునిట్ కోసం అనుష్క స్పెషల్ డ్యాన్స్
X
ఎక్కడైనా ఒక సినిమా షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేసిన డ్యాన్సును.. ఎవరైనా కూడా ఆ యునిట్ మెంబర్ల కోసం స్పెషల్ గా వేసి చూపిస్తారా? ఎప్పుడైనా ఇలా జరిగిందో లేదో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం మన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క తన యునిట్ మెంబర్ల కోసం ఒక ప్రత్యేక డ్యాన్స్ షో వేసి చూపించింది.

త్వరలో రాబోయే ''ఓం నమో వేంకటేశాయ'' సినిమా కోసం అనుష్క చాలా కష్టపడుతోంది. ఈ సినిమాలో మహా భక్తురాలు కృష్ణమ్మగా ఈమె ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర ఒక స్పెషల్ డ్యాన్స్ కూడా చేస్తుందట. ఈ ట్రెడిషనల్ డ్యాన్సును ఇతర నర్తకిలతో కలసి బాగా ప్రాక్టీస్ చేసిన అనుష్క.. షూటింగ్ పూర్తవ్వగానే ఏకంగా యునిట్ కోసం స్పెషల్ గా ఈ డ్యాన్సు వేసి మరీ చూపించిందట. అది చూసి తరించిపోయిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ విషయం స్వయంగా రివీల్ చేశారు. మొత్తానికి కింగ్ నాగార్జున హతీరామ్ బాబాగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషమే.

గతంలో నాగ్ సరసన గ్లామర్ పాత్రలను మాత్రమే పోషించిన అనుష్క.. ఇప్పుడు ఇలా భక్తిసంపన్నమైన పాత్రను పోషించడం అసలు అన్నింటికంటే పెద్ద విశేషం. ఈ సినిమాతో నాగ్ కూడా.. రాఘవేంద్రరావుతో కలసి.. ఏకంగా అన్నమయ్య - శ్రీరామదాసు - సాయిబాబా సినిమాల తరువాత మరోసారి భక్తిసారమైన కథతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.